ఏపీ సర్కార్ మార్చి, ఏప్రిల్లో అమలు చేసే పథకాలివే

These are the schemes to be implemented by the AP government in March and April

AP:ఏపీ సర్కార్ మార్చి, ఏప్రిల్లో అమలు చేసే పథకాలివే

ఆంద్రప్రదేశ్ లో  వైసీపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకటించి మరీ సంక్షేమ పథకాల నిధుల్ని విడుదల చేస్తున్నార.  ఈ ఏడాది మార్చి నెలలో విడుదల అవ్వవలసిన నిధుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో తేదీల్ని మారుస్తూ కొత్త తేదీల్ని ప్రభుత్వం ఈ రోజు  ప్రకటించింది.

మార్చి, ఏప్రిల్ నెలల్లో అమలు చేసే సంక్షేమ పథకాల తేదీల్ని ప్రభుత్వం గతంలోనే షెడ్యూల్ రూపంలో విడుదల చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఇందులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు మరోసారి అధికారులతో సంక్షేమ క్యాలెండర్ పై సమీక్షించిన వైఎస్ జగన్ కొత్త క్యాలెండర్ విడుదలకు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల చేసే పథకాలు, నిధుల వివరాలు ప్రకటించారు.

ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతోపాటుగా రాగిజావ అమలు ప్రారంభం కానుంది. మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు కానుంది. మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయబోతున్నారు. మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటిస్తారు. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందచేస్తారు.

అలాగే మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం కానుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకూ వైయస్సార్‌ ఆసరా పథకం కింద నిధులు విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 5 వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు చేస్తారు. ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం పథకం నిధులు విడుదల చేస్తారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh