Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటి పూట బడులు ఎప్పటి నుంచంటే?
ప్రస్తుతం తెలంగాణలో రాత్రి చలి తో వణుకుతుంటే పగలు మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడికి ప్రజలు ఇప్పుడే అవస్థలు పడుతున్నారు ఎండలు మరింతగా విజృంభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా స్కళ్లకు వెళ్లే చిన్నారులు ఎండతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒంటి పూట బడులకు సంబంధించి కూడా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలను వెల్లడించింది.
పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని మార్చి రెండో వారం నుంచి స్కూల్స్ ఒంటి పూటే నడుస్తాయని తెలిపింది. ఈ నెల (మార్చి) 15 నుంచే రాష్ట్రంలో ఒక్క పూట స్కూళ్లు ప్రారంభం అవుతాయని అధికార వర్గాల నుంచి సమాచారం. అలాగే సమ్మర్ హాలీడేస్ ఎప్పటి నుంచో ఇప్పటికే విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
ఈ హాఫ్ డే స్కూల్స్ టైంలో స్కూళ్లు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నడపనున్నారు. లాస్ట్ వర్కింగ్ డే అయిన ఏప్రిల్ 24 వరకు అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు ఇంకా సమ్మర్ నేపథ్యంలో ఒక్కపూట బడుల సమయంలో అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొంది.
ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించింది. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నాయి.
ఇది కూడా చదవండి :