Team india ఆ దరిద్రం కూడా పోయింది..ఇక టీ20 ప్రపంచకప్ టీమిండియాదే.
కీలక సెమీస్ మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభసూచకం. ఈ సారి మనదే ప్రపంచకప్ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ధీమాకు కారణం ఏంటంటే..టీ20 ప్రపంచకప్ 2022 కీలక ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 9, 10వ తేదీల్లో రెండు సెమీఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. సూపర్ 12లో లాగా సెమీస్ కథ ఉండదు. నాకౌట్ రౌండ్స్ కాబట్టి ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే.దాంతో సెమీస్ చేరిన నాలుగు జట్లు కూడా కఠోరంగా సాధన చేస్తున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ (NZ vs PAK)..
అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ (IND vs ENG) తలపడనుంది. దీంతో ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, 15 ఏళ్ల తర్వాత టీమిండియా మరో పొట్టి కప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దీంతో, సెమీస్ కోసం తెగ కష్టపడుతుంది. అడిలైడ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.ఇక, టీమిండియా ఆడే సెమీస్ మ్యాచుకు అంపైరింగ్ చేసే అంపైర్ల జాబితాను ఐసీసీ తాజాగా విడదుల చేసింది. కుమార ధర్మసేన- పాల్ రీఫెల్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా..
క్రిస్ గాఫ్‌నే మూడో అంపైర్‌గా.. రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ఇక, ఈ లిస్ట్ చూసిన టీమిండియా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సారి టీ20 ప్రపంచకప్ భారత్‌దేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెమీస్‌లో ఇంగ్లండ్ చిత్తవ్వడం ఖాయమని, ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చినా.. పాక్ తలపడినా.. రోహిత్ సేన విజయాన్ని ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.టీమిండియా ఫ్యాన్స్ ఆనందానికి, ధీమాకు ఓ కారణం ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఐరన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడమే.
గత 9 ఏళ్లుగా భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి కెటిల్ బరోనే కారణమని, ఈసారి అతను లేడు కాబట్టి భారత్ విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2013 చాంపియన్స్ ట్రోఫీతో చివరి ఐసీసీ టైటిల్‌ను గెలిచింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో ఆరు సార్లు నాకౌట్ చేరినా.. టీమిండియాకు ఓటమే ఎదురైంది. ముఖ్యంగా కెటిల్ బరో అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది.2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. భారత్ ఓటమిపాలైంది. దీంతో.. ఈ సారి రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడంతో టీమిండియాదే కప్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టీమిండియా ఫ్యాన్స్ కు బాంబు లాంటి వార్త.
15 ఏళ్ల తర్వాత టీమిండియా మరో పొట్టి కప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దీంతో, సెమీస్ కోసం తెగ కష్టపడుతుంది. అడిలైడ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అడిలైడ్ ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా స్టార్ ఆటగాడు గాయపడ్డాడు.టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2022 కీలక ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 9, 10వ తేదీల్లో రెండు సెమీఫైనల్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. సూపర్ 12లో లాగా సెమీస్ కథ ఉండదు. నాకౌట్ రౌండ్స్ కాబట్టి ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే.
దాంతో సెమీస్ చేరిన నాలుగు జట్లు కూడా కఠోరంగా సాధన చేస్తున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ (NZ vs PAK).. అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ (IND vs ENG) తలపడనుంది. దీంతో ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక, 15 ఏళ్ల తర్వాత టీమిండియా మరో పొట్టి కప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దీంతో, సెమీస్ కోసం తెగ కష్టపడుతుంది. అడిలైడ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.టీ20 వరల్డ్ కప్ కీలక సమయంలో టీమిండియాకు భారీ షాక్ తగిలేలా ఉంది. అడిలైడ్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా.. రోహిత్ శర్మ కుడి చేతికి గాయమైంది.
గాయం అయిన తర్వాత రోహిత్ శర్మ విలవిల్లాడుతూ క్రీజు వదిలి వెళ్లిపోయాడు. చాలా సేపు వరకు ప్రాక్టీస్ చేయలేదు. దీంతో.. టీమ్ మేనేజ్మెంట్ తెగ టెన్షన్ పడినట్టు సమాచారం.అయితే, కొంత విరామం తర్వాత రోహిత్ శర్మ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో.. ఇండియన్ కోచింగ్ స్టాఫ్, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాలేదు. గాయంతో ఆడితే.. అసలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.ఇక, ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ అంతగా ఫాంలో లేడు.
ఒక నెదర్లాండ్ మ్యాచులో మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా మ్యాచుల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే, ఫామ్ లో లేకపోయినా.. అతడు జట్టును నడిపించిన తీరు అద్భుతం.ఒత్తిడి సమయంలో కెప్టెన్ గా హిట్ మ్యాన్ తీసుకునే నిర్ణయాలు జట్టుకు కీలకం. దీంతో.. అతడు జట్టుకు దూరమైతే.. టీమిండియా భారీ నష్టం తప్పదన్న ఓ అంచనా ఉంది. మరోవైపు.. రోహిత్ శర్మ తిరిగి లయ అందుకుని విధ్వంసం సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
టెస్టుల్లో 360 డిగ్రీలో బ్యాటింగ్‌తో అసలు సిసలు టీ20 ఆటకు పర్యాయపదంగా మారిన ఆటగాడు.
సూర్యకుమార్ యాదవ్ అలియాస్ స్కై. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో అతడే ప్రధాన ఆకర్షకుడు. ఎవరి నోట విన్నా అతడి పేరే. ఎక్కడైనా అతడి గురించి చర్చే. 360 డిగ్రీల బ్యాటింగ్‌తో అసలు సిసలు టీ20 ఆటకు పర్యాయపదంగా మారిపోయాడు సూర్య. ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో బౌలర్లపై అతడు సాగిస్తున్న దండయాత్ర సమకాలీన క్రికెట్లో సరికొత్త అధ్యాయమే. గత ఏడాది కాలంగా సూర్య కొట్టిందల్లా సిక్సరే.. బాదిందల్లా బౌండరీయే! 2021లో అరంగ్రేటం చేసిన అతడు ఇప్పటి వరకు 39 టీ20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 12 అర్ధ శతకాలతో 1270 పరుగులు రాబట్టాడు.
సగటు 42.33 కాగా.. స్ట్రైక్ రేటు 179 పైచిలుకే. ప్రస్తుత పొట్టి కప్పులో 5 మ్యాచ్ 193.96 స్ట్రెక్ రేటుతో 225 పరుగులు సాధించాడు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై అర్ధ శతకాలతో అదరగొట్టాడు. అతడి ఒక్కో ఇన్నింగ్స్ ఒక్కో ఆణిముత్యం. ఆదివారం జింబాబ్వేపై అతనాడిన ఇన్నింగ్స్ ఈ పొట్టి కప్పుకే హైలైట్.ఏబీ డివిలియర్స్‌ను మరిపిస్తూ సూర్య ఆడిన షాట్లు అసామాన్యం. క్రీజులో యథేచ్ఛగా కదులుతూ అతడు ఆడే ర్యాంప్, స్కూప్, స్వీప్, రివర్స్ స్వీప్, డ్రైవ్‌లు ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. పేసర్ల బౌలింగ్‌లో కొట్టే ల్యాప్ స్వీప్, స్క్వేర్ స్వీప్‌లు అద్భుతాలే. సూర్య ఆడిన ప్రతి షాట్లో మంచి టైమింగ్ ఉంటుంది. అతడి ఇన్నింగ్స్ రెండు, మూడు షాట్లతో సిద్ధమవుతున్నాడు. బంతి వేగం, స్వింగ్, ఫీల్డర్ల మోహరింపునకు అనుగుణంగా బ్యాట్ ఝుళిపిస్తున్నాడు.
బ్యాటుకు బంతి ఎక్కడ తగిలినా అతని స్ట్రోక్ కారణంగా బౌండరీ ఆవలకే దూసుకెళ్తుంది. అసాధారణ స్ట్రోక్ తో పాటు క్రికెట్ పుస్తకంలోని సంప్రదాయ షాట్లన్నీ ఆడుతూ పరిపూర్ణ బ్యాటర్‌గా ఎదిగాడు సూర్య. మిగతా బ్యాటర్ల కంటే ఒక మెట్టు పైనే ఉన్న సూర్య గత కొన్ని నెలలుగా వేరే స్థాయిలో ఆడుతున్నాడు. టీ20 క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాడు. ప్రస్తుత క్రికెట్లో ప్రతి బ్యాటర్ షాట్లు ఆడగలడు. కానీ బంతి వెళ్లదనుకునే ప్రాంతాల వైపు అసాధారణ రీతిలో షాట్లు ఆడటం సూర్య ప్రత్యేకత.
బౌలర్క బంతి ఎక్కడ వేయాలో అర్థంకాని పరిస్థితిని తీసుకొస్తాడు. ఇక మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్ అతని మరో ప్రత్యేకత. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తీవ్రమైన ఒత్తిడిలో సూర్యఅందుకున్న రెండు క్యాచ్‌ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి తడబాటు లేకుండా బంతిని లాఘవంగా ఒడిసి పట్టుకోవడం.. మెరుపు వేగంతో కూడిన ఫీల్డింగ్ సూర్యను మరింత నాణ్యమైన జట్టు ఆటగాడిగా మార్చేశాయి.32 ఏళ్ల సూర్య ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. పిచ్ ఎలా ఉన్నా.. బౌలర్ ఎవరైనా సూర్య విన్యాసాలు మాత్రం ఆగట్లేవు.
ప్రస్తుత భా జట్టులో అందరి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న ఆటగాడు సూర్య అనడంలో అతిశయోక్తి లేదు. అతని కంటే మెరుగైన బ్యాటర్ కూడా లేడు! మరి అలాంటి ఆటగాడు టీమిండియా టెస్టు జట్టులో ఎందుకు లేడన్నది ఇప్పటికీ నమ్మలేని నిజం. డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టులకు ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకు సెలక్టర్లు చోటివ్వలేదు. కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్న సూర్య కనీసం మరో రెండు, మూడేళ్లు ఇదే లయ, ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగలడు. మరి అలాంటి ఆటగాడికి సరైన సమయంలో అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత సెలెక్షన్ కమిటీదే.
మంచి జోరుమీదున్న ఆటగాడిని ప్రోత్సహించి.. ప్రమోషన్ ఇవ్వాల్సిందీ సెలెక్టర్లే. మిడిలార్డర్ సూర్య లాంటి ఆటగాడు ఉండటం జట్టుకు కూడా ఉపయోగమే. “సూర్య మూడు ఫార్మాట్ల ఆటగాడు. అయితే టెస్టులనేసరికి అతని గురించి మాట్లాడరు. కాని సూర్య టెస్టులు ఆడగల సమర్థుడు. అవకాశమిస్తే ఎంతోమందిని ఆశ్చర్యపరచగలడు” అన్న రవిశాస్త్రి అభిప్రాయం నూటికి నూరు శాతం సరైనదే.