వాళ్ల సంస్కారం వాళ్లది నా సంస్కారం నాది – తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja React On rrr controversy

RRR ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు  చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చిచ్చు లేపాయి ఆయన చేసిన  వ్యాఖ్యలపై   మెగా బ్రదర్‌ నాగబాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రం గట్టిగా రియాక్టయ్యారు. ముఖ్యంగా నాగబాబు పరుషమైన పదజాలంతో తమ్మారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తమ్మారెడ్డి.

అలాగే రాఘవేంద్రరావు, నాగబాబు  చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. నేను ఒక సెమినార్ లో పాల్గొని అక్కడ యంగ్ డైరెక్టర్స్ తో దాదాపు 3గంటలు మాట్లాడాను. అయితే అందులో ఒక నిమిషం క్లిప్ మాత్రమే విని ఎవరెవరో రియాక్ట్ అవుతున్నారు. అందులో ప్రస్తుతం చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ బడ్జెట్‌పై మాట్లాడాను అని అన్నారు.

దీనిపై కొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేయటం బాధ కలిగించింది. ఒకరు అకౌంట్స్ అడుగుతారు ఇంకొకరు ఇంకొకటి అంటారు. వీటిని వింటుంటే చాలా బాధగా, అసహ్యంగా ఉంటోంది. వాళ్ల సంస్కారం వాళ్లది నా సంస్కారం నాది. ఇప్పుడు నాకు ఐడెంటిటీ క్రైసిస్ ఏమి లేదు. నన్ను టార్గెట్‌గా చేసుకొని వాళ్లు ఐడెంటిటీ కోసం చేస్తున్నారేమో తెలియదు. నేను కొన్ని రోజుల ముందు రాజమౌళిని అభినందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసాను.

అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ భారతదేశానికి గర్వకారణమని చెప్పాను. అది ఎవరు చూశారో తెలియదు. గానీ ఈ వీడియోను చూసి కామెంట్స్ చేస్తున్నారని ట్వీట్లు కూడా పెడుతున్నారు’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ కోసం పోటీపడుతున్న విశయం తెలిసిందే, కానీ ఆ ప్రమోషన్ కోసం ఆర్ ఆర్ ఆర్  టీం ఎప్పటికే అమెరికా వెళ్లారు. ఆ టీం వెళ్లడంపై తమ్మారెడ్డి బారద్వాజ్ తప్పు పట్టినాట్లు కొన్ని వీడియోస్ బయటకు రావడంపై కొందరు సినీ ప్రముకులు తమ్మారెడ్డి పై సోషల్ మెడియా ద్వారా నిప్పులు చెరిగారు. దానికి బదులుగా తమ్మారెడ్డి ఈ వివరణ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh