Swetha: వరకట్న వేదింపు వల్లనే శ్వేత ఆత్మహత్య : శ్వేత తల్లి

Swetha

వరకట్న వేదింపు వల్లనే శ్వేత ఆత్మహత్య : శ్వేత తల్లి

Swetha: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో మంగళవారం అర్ధరాత్రి తీరానికి కొట్టుకువచ్చిన ఓ యువతి మృతదేహం ఆమె గురువెల్లి శ్వేత (24)గా పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతకు కొన్ని గంటల ముందే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న బీచ్‌లో మృతదేహం ఇసుకలో కూరుకుపోవడం, లోదుస్తులు మాత్రమే ఉండటంతో తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసు దర్యాప్తు అనంతరం అసలు విషయాలు వెల్లడయ్యాయి. శ్వేత ఐదు నెలల గర్భిణి. ఈమె కుటుంబీకుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మూలపేట. తండ్రి చనిపోయారు. తల్లి రమ విశాఖ రైల్వే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ దొండపర్తిలో ఉంటున్నారు.

ఏడాది క్రితం గాజువాక సమీపంలోని ఉక్కు నిర్వాసితకాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గురువిల్లి మణికంఠతో వివాహం అయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. పదిహేను రోజుల క్రితం కార్యాలయ పనిపై మణికంఠ హైదరాబాద్‌ వెళ్లారు. అత్తమామలతో కలిసి ఉంటున్న Swetha మంగళవారం సాయంత్రం అత్తతో గొడవ పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అత్తమామలు ఆసుపత్రి పనిమీద బయటకు వెళ్లారు. అనంతరం భర్త మణికంఠతో శ్వేత ఫోన్లో చాలాసేపు మాట్లాడారు. కుటుంబపరమైన అంశాలపై వారి మధ్య మాటామాటా పెరిగింది. ఫోన్‌ ఆపేసి ఇంటికి తాళాలు వేసి పక్కింట్లో అందజేసిన ఆమె రాత్రి 7.30 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో నీలింరంగు గౌన్‌ ధరించి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. కాసేపటికి ఇంటికి వచ్చిన అత్తమామలు శ్వేత పక్కింట్లో ఇచ్చిన తాళాలు తీసుకుని తలుపులు తీసి చూడగా ఆమె భర్తను ఉద్దేశించి రాసిన లేఖ కనిపించింది. కోడలు ఇంటికి రాకపోవడంతో న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 12 గంటల సమయంలో అదృశ్యం కేసు నమోదు చేశారు.

ఆ తరువాత రెండు గంటలకు ఆర్కే బీచ్‌ తీరంలోని ఇసుకలో ఓ యువతి మృతదేహం కూరుకుపోయి ఉన్నట్లు సమాచారం వచ్చింది. పోలీసులు అది శ్వేతదే అని గుర్తించారు.  బీచ్‌లో రాత్రి 10-11 గంటల వరకు సందడిగానే ఉంటుంది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండదు. పైగా బీచ్‌ పెట్రోలింగ్‌, రక్షక్‌ టీం, బీచ్‌ గార్డ్స్‌ సంచరిస్తూ ఉంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్యకు యత్నిస్తే తెల్లవారుజామున 2 గంటలకే మృతదేహం వెలుగులోకి రావడం, ఇసుకలో కూరుకుపోవడం, ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉండటం వంటివి ప్రశ్నలుగా మారాయి. ఒంటిపై గాయాల్లేవని పోలీసులు చెబుతుండగా, పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. గురువారం పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. బీచ్‌ సమీపంలో ఇటీవల గంజాయి ముఠాలు హడావుడి ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

కడుపులో బిడ్డ కోసం అయిన బ్రతకాల్సినది అని భాద పడుతున్నారు

కనీసం ఆమె కడుపులో వున్నా  బిడ్డ కోసమైనా ఆలోచించాల్సింది ‘మంగళవారం సాయంత్ర 6.15గంటలకు ఫోన్‌ చేసి మాట్లాడింది. చాలా వరకు సర్దిచెప్పాను. కుటుంబంలో చిన్న,చిన్న సమస్యలొస్తాయని, సర్దుకు పోవాలని కోరాను. కనీసం కడుపులోని బిడ్డ కోసం ఆలోచించినా బాగుండేది. ఫోన్‌ చేసి మాట్లాడుతున్నప్పుడే స్విచ్‌ ఆఫ్‌ చేసింది. తొందరపాటు వద్దంటూ ఎన్నో మెసేజ్‌లు పెట్టాను. న్యూపోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చాను. ఇంతలోనే ఈ దారుణం జరిగింది’ అని శ్వేత భర్త మణికంఠ పేర్కొంటున్నారు.

శ్వేత తల్లి ‘నా కూతురు గుణం, అందంలో లక్ష్మీదేవి. బీటెక్‌ చదివిన శ్వేత సివిల్స్‌కు సన్నద్ధం అవుతానంది. పెళ్లైన తర్వాత చదివించకుండా వంటింటికి పరిమితం చేశారు. శ్వేత అత్తది నటన. అత్త, ఆడపడుచు కడుపుతో ఉన్న అమ్మాయిని హింసలు పెట్టారు. నెల రోజుల క్రితం కూడా విడాకులు ఇస్తామని Swetha ను బెదిరించారు. మంగళవారం కూడా ఫోన్‌ చేసి అత్త ఇంటిలో ఇబ్బందులు చెప్పింది. ఇంటికి వచ్చేయమని చెప్పాను. వరకట్నం కోసం శ్వేతను వేధించేవారు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం చాల్లేదని, ఇంకా తేవాలని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేశారు. పెళ్లి సమయంలో రూ.10లక్షల కట్నం ఇవ్వగా, మరో రూ.లక్ష లాంఛనాల కింద ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారన్నారు. కూతురులా చూసుకుంటామని చెప్పి ఎన్నో ఇబ్బందులు పెట్టారు’ అని శ్వేత తల్లి రమ విలపించారు. ఈమేరకు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై సంతోష్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాల్లేవని ఈస్ట్‌ ఏసీపీ వివేకానంద తెలిపారు. సముద్రంలో గల్లంతైన వ్యక్తులు ఇసుకలో కూరుకుపోవడం సహజంగా జరుగుతుందన్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh