సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంత క్రేజ్ వుందో అందరికి తెల్సిందే. ఇక మహేష్ బాబు స్టామీనా గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. డేరింగ్ అండ్ డాషింగ్, నటశేఖర కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అను నేను, మహర్షి, సర్కార్ వారి పాట వంటి బాక్సాఫీస్ షేకింగ్ హిట్లతో ఆగ్ర స్థానంలో వున్నాడు మహేష్ బాబు. 2024 సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచినా కలెక్షన్లతో బాక్సాఫీస్ హిట్ మూవీస్ తో పోటీపడింది.
మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో చేస్తున్నారు. రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు తన లుక్‌ను సైతం మార్చేశారు. గెడ్డం, జుట్టు ఫుల్‌గా పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో నటించిన హీరోయిన్లు సైతం స్టార్‌లుగా ఎదిగారు. మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్లు చాలామంది సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఎంతో మంది హీరోయిన్‌లకు మంచి లైఫ్‌ను ఇచ్చారు మహేష్ బాబు. పోకిరి’ లో ఇలియానా, ‘దూకుడు’ లో సమంత, ‘ఒక్కడు’ లో భూమిక, ‘అతడు’ లో త్రిష వంటి హీరోయిన్లు టాప్ స్థానానికి చేరుకున్నారు.
అలాంటిది ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబుతో నటించనని చెప్పారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సౌందర్య. అప్పట్లో మహేష్ బాబు, సౌందర్య కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. మహేష్ బాబు రెండో సినిమా యువరాజు.. ఈ సినిమాకు వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్యను తీసుకున్నారట. మహేష్‌తో సినిమా అనగానే సౌందర్య సైతం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో మహేష్, సౌందర్య ఇద్దరితో వైవిఎస్ చౌదరి టెస్ట్ లుక్ షూట్ ప్రారంభించారు. అయితే టెస్ట్ లుక్‌లో మహేష్ పక్కన తనని తాను చూసుకున్నప్పుడు సౌందర్యకి ఏమాత్రం నచ్చలేదట. ఎంతలా చూసుకున్న మహేష్ బాబు పక్కన తాను హీరోయిన్‌గా సెట్ కావడం లేదని భావించిన సౌందర్య, ఈ సినిమా నుంచి తప్పుకున్నారట.
అంతే కాకుండా ఇంకెప్పుడు మహేష్ బాబుతో ఆమె నటించకూడదని ఆమె నిర్ణయించుకున్నారట. గతంలో సౌందర్య మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సరసన దాదాపు అయిదు ఆరు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ఒకవేళ యువరాజు సినిమాలో ఆమె మహేష్ బాబు పక్కన నటించినా, ప్రేక్షకులు దీన్ని తిరస్కరిస్తారనే ఆలోచనతో సౌందర్య ఈ సినిమా నుంచి తప్పుకున్నారట. వయసులో కూడా మహేష్ బాబు కంటే 3 ఏళ్ళు సౌందర్య పెద్దవారు. దీంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడమే మంచిది అయిందనే అభిప్రాయం ప్రేక్షకులు అప్పట్లో వ్యక్తం చేశారట. సౌందర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ ఛాన్స్ సిమ్రాన్‌ను వరించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.