తన అందాలతో కాక పుట్టిస్తున్న శ్రియ
అందాల తార శ్రియ సరన్ గత రెండు దశాబ్డాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ అండ్ గ్లామర్‌తో రాణిస్తోంది. టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది. శ్రియ ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంటోంది. అంతేకాదు ఎప్పటి కపుడు తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది.
తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన భామ శ్రియ టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్ని పెళ్ళాడినా సినిమాలకు మాత్రం దూరం కాలేదు. కాకపోతే సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట మంట పుట్టించే రొమాంటిక్ అప్డేట్స్ షేర్ చేస్తోంది.
సోషల్‌మీడియాలో గ్లామర్ షోతో పాటు పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటుంది శ్రియ. అలాగే శ్రియ సినిమాల విషయానికొస్తేశ్రియ గతేడాది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో నటించారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఆ తర్వాత దృశ్యం2లో మరోసారి అజయ్ సరసన మెరిసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అందుకుంది. అటు నానా పాటేకర్‌తో కలిసి ‘తడ్కా’ సినిమాలో మెరిసింది. కుర్ర హీరోయిన్లతో సమానంగా అందాలను ఆరబోస్తోంది ఈ సీనియర్ హీరోయిన్.
వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. మొదట ఇష్టం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయ ఆ తర్వాత చాలా సినిమాలలో నటించింది. అటు పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరితోనూ హీరోయిన్గా నటించి మంచి పేరు సంపాదించింది. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు ఎంత అందంతో ఆకట్టుకుందో ఇప్పటికీ అంతే అందంతో ఆకట్టుకుంటున్నారు నటి శ్రియ తన చర్మ సౌందర్యం పెంచుకోవడానికి ఎక్కువగా హోమ్ రెమిడీస్ నే వాడతారట.
వాటి కారణంగానే తన చర్మం అందంగా మెరుస్తుందని ఆమె చెబుతున్నారు. శ్రియ ముంబైలో ఖరీదైన ప్రాంతం బాంద్రా లోని కొత్తింట్లోకి మకాం మార్చిందన్న వార్త ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారిందిఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కొఛీవ్ తో ఇటీవలే మళ్లీ భారత్ లో ల్యాండైంది. అంతేకాదు వచ్చీ రాగానే ముంబైలో తన అభిరుచులకు అనుగుణంగా కొత్తింటిని ఏర్పాటు చేసుకుంది.
ఇది కూడా చదవండి :