అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోతున్నాయి. అమెరికా మార్కెట్లు ముఖ్యంగా గత సెషన్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో ఆసియా సహా ఇతర దేశాల స్టాక్ మార్కెట్ సూచీలు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 120 పాయింట్లకుపైగా కోల్పోయి.. 60 వేల 900 మార్కు ఎగువన కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 40 పాయింట్ల పతనంతో 18 వేల 100 మార్కు వద్ద కదలాడుతోంది. మెటల్ స్టాక్స్ రాణిస్తుండగా.. పవర్, అటిలిటీస్ సెక్టార్లు దారుణంగా పడిపోయాయి. యూపీఎల్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోల్ ఇండియా లాభాల్లో ఉండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ డీలాపడ్డాయి. యితే దేశీయ మార్కెట్లు పడుతున్నా ఒక స్టాక్ మాత్రం ఇవాళ టాప్ ట్రెండింగ్‌లో నిలిచి ఒక్కరోజే 6 శాతానికిపైగా పెరిగింది.
అదే మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్ లిమిటెడ్ ఆరంభ గంటల్లో 6 శాతానికిపైగా పెరిగినా ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ.390 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 500 స్టాక్స్‌లో టాప్ గెయినర్లలో ఇది ఒకటిగా నిలిచింది. గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఇది మంచి అప్ ట్రెండ్‌లో కొనసాగుతుండటం విశేషం. మంచి ప్రైస్ వాల్యూమ్ బ్రేకవుట్‌ను నమోదు చేసింది. ఇది తాజాగా 52 వారాల గరిష్ట విలువను రూ.396.7 వద్ద నమోదు చేసింది. గత నెలన్నర కాలంలో మంచి వాల్యూమ్స్‌తో ఏకంగా 35 శాతానికిపైగా పెరగడం విశేషం. 14 డే RSI, ADX, MACD కూడా మంచి స్థాయిలో ఉండి రానున్న సెషన్లలో కూడా ఈ స్టాక్ పెరగనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. దీనిని వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి:
- గన్నవరంలో చంద్ర బాబు చేసిన కామెంట్లపై ఘాటుగా రియాక్ట్ అయ్యన కొడాలి
- రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత లా పెళ్లి కి ముఖ్య అతిధులుగా రోజా దంపతులు