సమంత ప్రత్యేక పూజలు చేయించడానికి కారణం ఇదే
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూనే వుంటున్నాయి . సమంత ప్రతి అడుగును పసిగడుతూ మీడియాలో బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. డివోర్స్ తర్వాత తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టిన సమంత. కెరీర్ పరంగా వినూత్నమైన స్టెప్స్ వేస్తూ వస్తోంది. ఇంతలో ఇటీవలే ఆమెకు మాయోసైటిస్ అనే వ్యాధి సోకిందని తెలిసి సామ్ అభిమానులు ఆందోళన చెందారు. మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి తనకు సోకిందని స్వయంగా ప్రకటించిన సమంత. ఇందుకు చికిత్స తీసుకుంటూ చాలా రోజుల పాటు ఇంట్లోనే ఉంది. ఎలాంటి ప్రాజెక్ట్స్ లో భాగం కాకుండా కొన్ని నెలలు రెస్ట్ తీసుకొని రీసెంట్ గా తిరిగి బయటకొచ్చింది ఆమె. ప్రస్తుతం తాను కమిటైన సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూనే భక్తి మార్గంలో పయనిస్తోంది సమంత. తన తీరక సమయంలో తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించింది సమంత. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ ఆధ్యాత్మిక చింతనలో ఉండిపోయింది సమంత. మరోసారి ఇలా భక్తి మార్గంలో సమంతను చూసి ఆమె ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. సమంత పూర్తిగా అనారోగ్యం నుంచి బయటపడింది కాబట్టే మళ్ళీ ఇలా టెంపుల్స్ దర్శించుకుంటోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత మొక్కు తీర్చుకునేందుకు సామ్ ఈ ఆలయాన్ని సమంత దర్శించుకుందని చెప్పుకుంటున్నారు జనం. తాజాగా బయటకొచ్చిన ఈ ఫొటోల్లో సింపుల్ సల్వార్ కమీజ్ డ్రెస్ ధరించి, మాస్క్ తో కనిపిస్తోంది సమంత.
గత రెండు మూడు రోజుల క్రితమే తన హెల్త్ అప్డేట్ ను తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేసింది సామ్. మయోసైటిస్‌కి సంబంధించిన నెలవారి ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరఫీ) సెషన్‌కి హాజరైనట్టు సమంత పేర్కొంది. న్యూ నార్మల్ అంటూ ఈ హెల్త్ అప్డేట్ ను అభిమానులతో పంచుకుంది. కొత్తగా తాను పూర్వస్థితికి చేరుకున్నట్టు ఆమె తెలిపింది. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్ సమర్దంగా పనిచేయించడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ ఫెక్షన్ భారినపడకుండా ఈ ఐవీఐజీ థెరపీ ఉపయోగపడుతుంది. రోజు సుమారు నాలుగు గంటల సమయం ఈ థెరపీ కోసం వెచ్చించాల్సి ఉంటుంది.
తన ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ద తీసుకుంటున్న సమంత. ఎప్పటికప్పుడు జిమ్ లో వర్కవుట్స్ చేస్తోంది. ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకొని. తన వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. తాజాగా సమంత ఆరోగ్యం కుదుటపడిందని తెలియడం ఆమె ఫ్యాన్స్ లో జోష్ మొదలు అయ్యింది .ఈ మధ్య యశోద సినిమాతో అలరించిన సామ్ ఇప్పుడు శాకుంతలం సినిమాతో రెడీ అయింది. మెథలాజిక్ మువీగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా.
కొన్ని కారణాలతో వాయిదావేసి ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సమంత తన కెరీర్ లో తొలిసారి పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది. నీలిమ గుణ, దిల్ రాజు నిర్మాతలుగా శాకుంతలం అనే పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, గౌతమి, మధుబాల, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అన్ని అప్డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో పాటు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా చేస్తోంది సమంత. దీంతో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.
ఇది కూడా చదవండి: