సమంతకు చేతులకు గాయాలు ఏంటి ? అసలు ఏమి జరిగింది ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిత్యం ఏదో ఒక కోణంలో వార్తల్లో నిలుస్తోంది. నిజ జీవిత విషయాలే కాకుండా సినిమా అప్టేట్స్ కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది -సినిమాల పరంగా, వ్యక్తిగతంగా సమంతకు సంబంధించిన ఇష్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న తాజాగా పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు షాకవుతున్నారు. ఇంతకీ సమంత ఏం ఫోటో షేర్ చేసిందో తెలుసుకుందామా.
సమంత షేర్ చేసిన ఫొటోలో తన చేతులకు గాయాలతో కనిపించింది. ఈ పిక్ చూసి ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. మళ్ళీ సమంతకు ఏమైంది? ఎలా గాయాలయ్యాయి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి సమంత ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
ఇటీవలే మయోసైటిస్ బారినపడి కొన్ని నెలల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న సమంత. ఆ సమస్య నుంచి కోలుకొని తిరిగి తాను కమిటైన సినిమాల సెట్స్ మీదకొస్తోంది. అయితే తన సమంత షూటింగ్ లోనే గాయపడిందా అని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. సిటాడెల్ చిత్రీకరణలో సామ్ గాయపడినట్లుగా తెలుస్తోంది. చేతులకు స్వల్ప గాయాలు. రక్తపు మరకలు కనిపిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ లో కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర సామ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఖుషి సినిమా కోసం డేట్స్ ఇచ్చిందట సమంత. విజయ్ దేవరకొండతో ఆమె సెట్స్ మీదకు రావడానికి రెడీ అయింది. మార్చి నెలలో ఖుషీ సెట్స్ మీద సమంత సందడి చేయనుంది. మార్చి 8 నుంచి సమంత షూటింగ్ లో జాయిన్ అవుతుందని తెలుస్తోంది. అలాగే సామ్ గుర్రపు స్వారీకి సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ సమంత కలిసి నటించారు. ఇప్పుడు అదే జోడీ మళ్ళీ ఖుషీ సినిమాతో వస్తుండటం, అది కూడా ఫీల్ గుడ్ ప్రేమకథ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.
అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. శాకుంతలం సినిమాలో తన కెరీర్ లో తొలిసారి పౌరాణిక రోల్ చేసింది సమంత. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఇది కూడా చదవండి: