sachin tendulkar: 23ఏళ్ల కుర్రాడిలా సచిన్ క్లాస్ బ్యాటింగ్..
sachin tendulkar-భారతదేశానికి క్రికెట్ ఒక మతం అయితే. ఆ మతానికి ఏకైక దేవుడు సచిన్ టెండుల్కరే. టీమిండియాలో ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ సచిన్ కు ఉన్న క్రేజే వేరు. అప్పట్లో సచిన్ గ్రౌండ్ లోకి అడుగు పెడుతున్నాడు అంటే చాలు. సచిన్.. సచిన్.. అన్న హోరు సముద్రపు అలల హోరు కంటే ఎక్కువగా వినిపించేది.
అయితే sachin tendulkar రిటర్మైంట్ ప్రకటించి చాలా కాలమే అయినప్పటికీ అతడిలో మాత్రం ఆ కళాత్మకమైన క్లాస్ ఆట ఏమాత్రం తగ్గలేదు. భారత్ వేదికగా జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా తాజాగా న్యూజిలాండ్ తో మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం కారణంగా కేవలం 5.5 ఓవర్లే మ్యాచ్ జరిగింది.
మ్యాచ్ జరిగింది 5.5 ఓవర్లే అయినప్పటికీ ఈ గేమ్ లో సచిన్ కళాత్మక ఆటకు ఫ్యాన్స్ మాత్రం ఫిదా అయ్యారు.రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా 12వ మ్యాచ్ ఇండియా లెజెండ్స్-న్యూజిలాండ్ లెజెండ్స్ మధ్య ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియాంలో జరిగింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ లెజెండ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మెుదటి నుంచే ఎదురుదాడికి దిగింది. సచిన్ తో ఓపెనర్ గా జతకట్టిన నమన్ ఓజా కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
ఓజా 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 18 పరుగులు చేసి షేన్ బాండ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికే భారత్ స్కోర్ 3.5 ఓవర్లకు 32/1. మరో ఎండ్ లో సచిన్ కూడా నేటి కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా 13 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేశాడు.
రైనా (9)రన్స్ తో క్రిజ్ లో ఉండగా 5.5 ఓవర్ల దగ్గర వర్షం రావడంతో ఆటను నిలిపి వేశారు. వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి భారత లెజెండ్స్ స్కోరు 5.5 ఓవర్లకు 49/1 తో నిలిచింది.
sachin tendulkar- క్లాస్ బ్యాటింగ్..
అదేంటి సచిన్ కొట్టింది కేవలం 19 పరుగులే కదా? మీరేంటి సచిన్ క్లాస్ బ్యాటింగ్ అంటున్నారు అనుకుంటున్నారా! “అన్నం ఉడికిందా లేదా.. అని అన్ని మెతుకులు పట్టుకుని చూడాలా! ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిదూ” అన్నట్లుగానే.
sachin tendulkar- ఒక్క షాట్ చూస్తేనే అతడి కళాత్మకమైన ఆట ఇంకా తగ్గలేదు అని మనకు తెలుస్తుంది. తాజాగా న్యూజిలాండ్ లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో సచిన్ కొట్టింది కేవలం 4 ఫోర్లు మాత్రమే కానీ ఆ ఫుట్ వర్క్.. ఆ టెక్నిక్.. ఆ స్టైలిష్ నెష్.
ఆ క్లాస్ ఆటకు అభిమానులు ఫిదా అయ్యారు. ట్వీటర్ వేదికగా సచిన్ కొట్టిన ఫోర్ల వీడియోలను షేర్ చేస్తూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తొలి ఓవర్ లో మిల్స్ వేసిన 5వ బంతిని స్వీపర్ కవర్ లో ఫోర్ కొట్టాడు. రెండో ఓవర్ వేయడానికి షేన్ బాండ్ వచ్చాడు.