గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇలా చెక్ చేసుకోండి
River Ganga: ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలొస్తాయి. ఈ ఏడాది River Ganga పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకూ 12 రోజుల పాటూ River Ganga తీర ప్రాంతాలన్నీ పుణ్యస్నానాలు చేసే భక్తులతో కళకళలాడిపోతుంటాయి. గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి. అయితే ఈ పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినవారు లక్షల సంఖ్యలో హాజరవుతారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే గంగా పుష్కరాలకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్, గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
సికింద్రాబాద్ -రాక్సల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిమ మధ్య రైల్వే ఏప్రిల్ 23,30 తేదీలతో పాటు మే 07 తేదీన ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి సోమవారం ఉదయం 10.30 గంటలకు బయల్దేరి మంగళవారం ఉదయం 06 గంటలకు చేరుతుంది. ఇక రాక్సల్ నుంచి సికింద్రాబాద్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏప్రిల్ 25, మే 2,9 తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయి. రాక్సల్ నుంచి రాత్రి 07.15 గంటలకు బయల్దేరి… రెండో రోజు మధ్యాహ్నం 02.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
తిరుపతి నుంచి ధన్ పూర్, ధనపూర్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఏప్రిల్ 22, 24,29, మే 01,6, 8 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం 07.15 గంటలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 11.15 గంటలకు ధన్ పూర్ చేరుతుంది. ఇక ధన్ పూర్ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్లు… మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి రెండో రోజు ఉదయం 07.45 నిమిషాలకు తిరుపతి చేరుతుంది. ఇక గుంటూరు -బనారస్, బనారస్ – గుంటూరు మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఏప్రిల్ 22,24,29, మే 1, 6, 08 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
సంతోష సంబరాలను వ్యక్తం చేస్తున్న భక్తులు
వారణాసిలో జరిగే River Ganga పుష్కరాల సందర్భంగా విశాఖ నుంచి వారణాసి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. దీంతో విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం, బనారస్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు దారిలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, సింగాపూర్ రోడ్, మునిగూడ, కేసింగ, తిత్లాగఢ్, బాలంగిర్, బార్గఢ్ రోడ్, సంబాల్పూర్, ఝర్సుగూడ, రౌర్కెల, హతియా, రాంచీ, మురి, బార్కకన, లేథర్, దాల్తోన్‌గంజ్, గార్వారోడ్ జంక్షన్, దేహ్రీ, సాసారం, భభువా రోడ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ, న్యూ వెస్ట్ క్యాబిన్, వారణాసి, బనారస్‌లో ఆగుతాయి.
అలాగే వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 44 వేసవి ప్రత్యేక రైళ్లు ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. నాందేడ్- ఈరోడ్, సంబల్పూర్-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతారు.ట్రైన్ నంబర్ 07189/07190 నాందేడ్-ఈరోడ్-నాందేడ్ స్పెషల్ ట్రైన్‌ను ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 వరకు నడుపుతారు. నాందేడ్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.20కు బయల్దేరే రైలు శనివారం మధ్యాహ్నం రెండుగంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07190 స్పెషల్ ట్రైన్ ఈరోడ్‌లో ఆదివారం ఉదయం 5.15కు బయల్దేరి సోమవారం ఉదయం 7.30కు నాందేడ్ చేరుతుంది. ఈరోడ్- నాందేడ్ ఈ రైలు ఏప్రిల్ 23 నుంచి జులై 2వరకు నడుపన్నారు.