EMCET: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

EMCET

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్ రద్దు

EMCET: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌కు 25 శాతం వెయిటేజీని రద్దు చేసింది. ఈ మేరకు 2011లో జారీ చేసిన జీఓ ఎంఎస్ 73ని సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం జీఓ ఎంఎస్ నెం.18ని జారీ చేసింది. దీని ప్రకారం తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మాత్రమే ర్యాంకులు ఇవ్వనున్నారు. గత రెండేళ్లలో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఈ నిబంధనను పూర్తిగా తొలగించింది.

ఇక ఈ ఏడాది EMCET మెడిసిన్ పరీక్ష మే 10 మరియు 11 తేదీలలో జరుగుతుంది. ఇంజనీరింగ్ పరీక్ష మే 12, 13 మరియు 14 తేదీలలో జరుగుతుంది. ఈ రెండు పరీక్షలు రెండు సెషన్‌లలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 మరియు మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు నిర్వహించబడతాయి.బుధవారం విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రైవేట్, కార్పొరేట కాలేజీలకు శరాఘాతం కానుంది. ర్యాంకుల కేటాయింపులో భారీగా వ్యత్యాసం వస్తుందని అంచనా వేస్తున్నారు.

కార్పొరేట్ కాలేజీలలో విద్యాభ్యాసం చేసిన వారికే ర్యాంకులు దక్కడంతో పాటు, ఇతరత్రా అవకతవకలకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఉన్నాయి. కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల దందాపై గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అధ్యాయనం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ఉత్తర్వులు వెలువరించింది. అయితే  ఏటా ఎంసెట్ రిజల్ట్ ఇచ్చే సమయంలో పలు బోర్డులకు సంబంధించిన ఫలితాలు రాకపోవడంతో ర్యాంకుల ప్రకటన ఆలస్యమవుతోంది.  EMCET అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్‌ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్‌ వెయిటేజీని రద్దు చేసింది.

ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్ రద్దు

కానీ ఈ విధానంతో విద్యార్థులకు నష్టం కలుగుతుందన్న వాదనలు వినిపించడంతో ఇంటర్‌ వెయిటేజీ రద్దుపై అధ్యయనానికై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డుల నుంచి అభిప్రాయాలు తీసుకోగాఈ శాఖలలోని నిపుణులు అందరూ ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దుకే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

ఈ ఏడాదితో కూడా కలిపి వరుసగా నాలుగేళ్లుగా ఇంటర్‌ వెయిటేజీ లేకుండానే ఎంసెట్‌ ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీంతో EMCET-2023 నుంచి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్‌ విద్యార్థులు బట్టీపట్టి 900లకు పైగా మార్కులు పొందుతున్నారు. కానీ అదే ఎంసెట్‌లో కనీస మార్కులు కూడా పొందలేకపోతున్నారు. సబ్జెక్టు పరిజ్ఞానం లేనివారిని ఫిల్టర్‌ చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలకు కూడా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh