పురాతన కట్టడానికి పూర్వ వైభవం

restoration work begins sardar mahal

హైదరాబాద్‌లో ఎన్నో పురాతన అద్భుతమైన కట్టడాలు, ప్రాంతాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకు ముందడుగు వేస్తుంది. ఎప్పటికే చారితాత్మక భవనాలు అయిన చార్మినార్‌, గోల్కొండ, అసెంబ్లీ భవనం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీదు, సాలార్‌జంగ్‌ మ్యూజియం ఇలా ఎన్నో అద్భుతమైన కట్టడాలుగా ఎప్పటికే ఖ్యాతి పొందాయి. కాగా ఇప్పుడు పాతబస్తీలో ఉన్న సర్దార్ మహాల్‌ వంతు వచ్చింది. సర్దార్ మహాల్‌ ను  కల్చరల్ భవనంగా తీర్చి దిద్దాడానికి  ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

సర్దార్ మహాల్‌ ను 1900లో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన భార్యలలో ఒకరైన సర్దార్ బేగం కోసం యూరోపియన్ శైలిలో నిర్మించగా, నిర్మాణం పూర్తయ్యాక దీన్ని చూసిన సర్దార్ బేగానికి అది నచ్చక ఆమె అక్కడ ఉండలేదు. దాంతో అ భవనం అలాగే ఉండిపోయింది కానీ ఆ  భవనానికి మాత్రం ఆమె పేరే వచ్చింది.  1965లో దీనికి ఆస్తి పన్ను కట్టకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఈ సర్దార్ మహల్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ భవనంలో కొంతకాలం చార్మినార్ యునాని ఆసుపత్రి నడిచింది. ఆ తరువాత సిటీ సివిల్ కోర్టు ఇక్కడ పనిచేసింది. కార్పోరేషన్ స్వాధీనం చేసుకున్న తర్వాత  వారి సర్కిల్ కార్యాలయం ఈ భవనంలో పనిచేసింది. 2011లో ఈ భవనాన్ని మ్యూజియంగా మార్చారు. హెరిటేజ్ కన్సర్వేషన్ కమిటీ ఇంటాక్ సంస్థ దీన్ని హెరిటేజ్ భవనంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ సర్దార్ మహల్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన అభివృద్ధి పనులు కూడా మొదలయ్యాయి అని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh