Ramabanam: హిందీలో కూడా ఒకేసారి విడుదల

Ramabanam

హిందీలో కూడా ఒకేసారి విడుదల కానున్న రామబాణం

Ramabanam: టాలీవుడ్ మ్యాచ్  హీరో గోపీచంద్ నటించిన చివరి చిత్రం పక్కా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. గోపీచంద్  నటించిన ‘లక్ష్యం’ మొదటి సినిమా కాగా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మరో హిట్ ఫిల్మ్ ‘లౌక్యం’ కూడా శ్రీవాస్ డైరెక్షన్‌లో వచ్చిందే. ఇలా తన కెరీర్‌లో రెండు బిగ్గెస్ట్ హిట్స్ అందించిన శ్రీవాస్‌ ప్రస్తుతం గోపీచంద్ 30వ సినిమాగా  ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఒరిజినల్ తెలుగు వెర్షన్ తో పాటు హిందీలో కూడా 2023 మే 5న విడుదల చేయనున్నారు. ఇప్పటికే హిందీ ట్రైలర్ విడుదల కాగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ ను ఉత్తరాది రాష్ట్రాల్లోని బీ4యూ, గ్రాండ్ మాస్టర్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.

డింపుల్ హయతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్బూ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్తో కూడిన ఈ యాక్షన్ డ్రామాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. భూపతి రాజా రామ బాణం కథను రాశారు.

ఇక గోపీచంద్ విషయానికొస్తే.. ‘ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడుకి మర్యాద, ఇప్పుడు చెయ్యెత్తినోడికి మర్యాద’ అనే డైలాగ్‌తో పాటు ‘నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డ్ లాంటోన్ని.. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా స్పీడ్ తగ్గించకపోతే చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దాని పేరే’ అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కలబోతగా కట్ చేసిన ‘Ramabanam’ ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉంది. కంటెంట్ చూస్తుంటే గోపీచంద్‌కు హిట్ గ్యారంటీ అనే భరోసానిస్తోంది.

అలాగే ‘భైరవి పాత్రలో డింపుల్ హయాతిని యూట్యూబర్‌గా చూపించారు. వెన్నెల కిశోర్ ‘సావిత్రి’ క్యారెక్టర్ హిలేరియస్‌గా ఉంది. ఇక పెద్దాయన పాత్రలో హుందాగా కనిపించిన జగపతి బాబు.. ‘స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు, ఇవి రెండే మనిషిని కాపాడతాయి’ అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అలాగే అన్నం తినండి, కెమికల్స్ కాదని ఆయన చెప్పడం చూస్తుంటే.. సినిమాలో ఈ టాపిక్‌కు ప్రిఫరెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  డైరెక్టర్ శ్రీవాస్, గోపీచంద్‌.. తమది హిట్ కాంబినేషన్‌ అని Ramabanam సినిమాతో మరోసారి ప్రూవ్ చేయనున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh