KCR: ఇదే లాస్ట్ వార్నింగ్

KCR

KCR: ఇదే లాస్ట్ వార్నింగ్

KCR: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ 22 వసంతాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పార్టీ సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించారు.  ఈ  సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు  దళిత బంధు కార్యక్రమం అమలులో అక్రమాలు చోటు చేసుకోవడంపై  ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు దళితబంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద వుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది తన చివరి వార్నింగ్ అని మళ్లీ వసూళ్లకు పాల్పడితే టికెట్ దక్కదని, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మీ అనుచరులు తీసుకున్నా మీదే బాధ్యతని ఆయన హెచ్చరించారు.

అంతకుముందు KCR కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని కేడర్‌తో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ముఖ్యమని కేసీఆర్ అన్నారు.

అయితే అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానెల్‌ను కూడా నడపవచ్చని సీఎం సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీలను ఇన్‌ఛార్జీలుగా నియమిస్తామన్నారు. మూడు, నాలుగు నెలల్లో ఇన్‌ఛార్జీల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద టాస్క్ కాదన్న ఆయన` గత ఎన్నికల్లో కంటే ఎన్ని ఎక్కువ సీట్లు వచ్చాయన్నదే ముఖ్యమన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని.. జాగ్రత్తగా లేకుంటే మీకే ఇబ్బందని, తాను చేసేదేం లేదని కేసీఆర్ హెచ్చరించారు.

KCR: ఇదే లాస్ట్ వార్నింగ్

ముందుగా పార్టీ సెక్రటరీ జనరల్ ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసిన క్రమాన్ని వివరించారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత KCR దిశానిర్ధేశం చేశారు. రాజకీయ పంథాలో  తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగామన్నారు.

అదే పంథాలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలని చెప్పారు. మొక్క , జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటామన్న ఆయన  మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh