రాజధాని మార్పు కోసం జగన్ కు సలహా ఇచ్చిన రఘురామ రాజు

raghurama raju suggest to jagan

రాజధాని మార్పు కోసం జగన్ కు సలహా ఇచ్చిన రఘురామ రాజు

ఆంద్రప్రదేశ్ లో రాజధాని ఏదనే అంశంపై నిన్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటన తర్వాత మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. బుగ్గన కామెంట్స్ పై రేగిన చిచ్చును చల్లార్చేందుకు రంగంలోకి దిగిన మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆయన ప్రకటనకు భిన్నంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని వ్యవహారం, తరలింపుపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విశాఖేనని, మూడు రాజధానులు ఏమీ లేవంటూ నిన్న బెంగళూరులో ఆర్ధిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయం మరోసారివేడి మొదలు అయ్యింది. బుగ్గన ప్రకటనతో మూడు రాజధానులపై వైసీపీ ఇన్నాళ్లూ చేస్తున్న వాదనపై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో మంత్రులు అంబటి, ధర్మాన, సలహాదారు సజ్జల రంగంలోకి దిగి తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేనంటూ క్లారిటీ ఇస్తున్నారు. మరి బుగ్గన మాటల సంగతేంటని అడిగితే ఆయన చెప్పింది కూడా ఇదేనన్నారు. దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ నేడు విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర రాజధానిపై మంత్రులు పూటకొక మాట మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు తమకు తోచినట్లుగా మాట్లాడడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. రాజధాని అంశంపై తన మంత్రివర్గ సహచరులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నప్పటికీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకనీ మాట్లాడడం లేదని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ముఖ్యమంత్రి తో పాటు , మంత్రివర్గ సభ్యులు స్థిరత్వంలో అస్థిరత్వంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కానీ మంత్రుల మాటలు చూసి ప్రజలు మాత్రం ప్రభుత్వ పెద్దల ఏ మైందో అని అనుకుంటున్నారని చెప్పారు.

రాష్ట్రంలో రాజధాని మార్పు కోసం వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై స్పందించిన రఘురామ. ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన రాజధానిని తిరిగి అదే పార్లమెంటు చట్ట సవరణతో మార్చుకోవచ్చని సలహా ఇచ్చారు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారు ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. దీన్ని గతంలోనే సమర్ధించిన రఘురామ రాజు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని, తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుందని చెప్పారు. అంతేకానీ బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు నోటికొచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన రాష్ట్ర రాజధాని మారదన్నారు. మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడితే రానున్న ఎన్నికల్లో ప్రజలు గూబ గుయ్యిమనిపిస్తారని హెచ్చరించారు. అసలు రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈనెల 23వ తేదీ నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయని రఘురామ గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh