Pushpa: 2’ మూవీ ఆర్టిస్టుల బస్సుకు ఘోర ప్రమాదం
Pushpa: స్లైలిస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నమూవీ ‘పుష్ప 2’. షూటింగ్ శరవేగంతో జరుగుతోంది.
అయితే వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడీ చిత్రయూనిట్ కు అనుకోని
విధంగా ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పుష్ప-2 ఆర్టిస్టులతో కూడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది
ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. షూటింగ్ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ కొనసాగుతోంది. రాత్రి సినిమా షూటింగ్ ముగించుకుని ఆర్టిస్టులు ఉన్న
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఈ సమయంలో నార్కట్‌పల్లి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ
బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. స్థానికులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన
ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంతో పాటు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పుష్ప 2 ఆర్టిస్టులకు ప్రమాదం జరగడంతో
టాలీవుడ్ ఆర్టిస్టులు ఆందోళనకు గురవుతున్నారు. దీని పై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న సినిమా ‘పుష్ప 2’. ప్రస్తుతం
ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుపుకుంటోంది. ఈ మూవీ అల్లు అర్జున్ స్లైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు.
ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సరికొత్తగా డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు Pushpa: తన
నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. పుష్ప అంటూ ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అంటూ చెప్పిన డైలాగులు ప్యాన్ ఇండియా లెవల్లో పేలాయి.
అంతేకాదు తగ్గేదేలే అంటూ డైలాగు కూడా పాపులర్ అయింది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరపుకుంటోంది.
ఎక్కడా తగ్గకుండా సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది.
మొదటి పార్ట్ హిట్ Pushpa: కావడంతో రెండో పార్ట్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాపై తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.