తిరుమల శ్రీవారి సేవలో ప్రభాస్

 

Prabhas at Tirumala : తిరుమల శ్రీవారి సేవలో ప్రభాస్

 

నేడు (జూన్ 06) మంగళవారం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సంధర్బంగా యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని  దర్శించుకున్నారు. 2023 జూన్ 06 మంగళవారం వేకువజామున  సంప్రదాయ పంచె కట్టులో శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు.  ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రభాస్‌ను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ ప్రభాస్ తిరుమలలోనే బస చేసి, ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కానున్నాడు. ఈ వేడుకకు  త్రిదండి చిన్న జీయర్ స్వామి చీఫ్ గెస్టుగా హాజరు అవుతున్నారు. ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్, 200 మంది డ్యాన్సర్స్ ప్రదర్శన ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే కనివినీ ఎరుగని రీతిలో ఈ వేడుక ఉండనుందట.ఈ  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసమే చిత్రం యూనిట్ రెండున్నర కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందట. ఇక  ఎటూ  చూసినా తిరుమలలో  ప్రభాస్ బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు కనిపిస్తోన్నాయి. రామబాణాన్ని ఎక్కు పెట్టిన శ్రీరాముడి గెటప్‌లో ఉన్న నిలువెత్తు కటౌట్లను ఏర్పాటు చేశారు అభిమానులు.

అయితే తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ప్రభాస్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.  అతికష్టం మీద పోలీసులు ప్రభాస్ ను అక్కడినుంచి పంపించారు.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఆదిపురుష్  జూన్ 16న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుoది.  ఆదిపురుష్ రూపంలో వస్తున్న ఈ రామ రావణ యుద్ధం ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం అని ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ కన్ఫర్మ్ చేశాయి.

భారీ తారాగణం ఎంచుకున్న దర్శకనిర్మాతలు.. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ లను ఈ సినిమాలో భాగం చేశారు. దీంతో ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానులు  ఆశలు భారీ స్థాయి కి చేరాయి.  అయితే ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా ఈ మూవీ ఉంటుందని చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

అలాగే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.  ఇందులో   శ్రీరాముడిగా ప్రభాస్, సీతమ్మగా కృతి సనన్ నటించారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్- రావణుడి పాత్రను పోషించగాలక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే కనిపించనున్నారు.  ఓం రౌత్ దర్శకత్వంలో సుమారుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో  ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు.

 

తనకు కేన్సర్ సోకిందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh