నేడు పోలవరంలో ఏపీ సీఎం జగన్‌ పర్యటన

ఏపీ ప్రభుత్వం ఎంతో   ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  పోలవరం ప్రాజెక్టును రికార్డు సమయంలో స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసింది. కాఫర్‌ డ్యామ్‌ ఎత్తు 44 మీటర్లకు పెంచారు. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యింది.  నేడు పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రాజెక్టు ఏరియాకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.

రెండుసార్లు ప్రాజెక్టు ప్రాంతంలో హెలికాప్టర్‌లో తిరిగిన సీఎం జగన్  పనులు తీరును పరిశీలించారు. గతం కంటే భిన్నంగా ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్‌బండ్‌ కుంగిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. అధికారికంగా దనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున ఈ గైడ్‌బండ్‌ను నిర్మించారు. ఏడాది నుంచి చేస్తున్న పనులు ఫైనల్‌ దశకు వస్తున్న టైంలో గైడ్‌బండ్‌ మధ్యలో క్రాక్స్ వచ్చాయని తెలుస్తోంది. ఇది అప్రోచ్‌ ఛానల్‌ వైపునకు కుంగి పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారులు ఈ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేశారు. గైడ్‌బండ్‌ ఎలా కుంగింది కారణాలు ఏంటనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అలాగే కేంద్రం పోలవరం తొలిదశకు రూ.12,911 కోట్లు మంజూరు చేసింది. బిల్లుల చెల్లింపులో విధించిన పరిమితుల తొలగింపునకు అంగీకారం తెలిపింది. 2013-14 ధరలు కాకుండా తాజా ధర మేర నిధులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్ర ఆర్థికశాఖ లేఖ రాసింది. కేంద్ర ఆర్థికమంత్రి ఆమోదించినట్లు లేఖలో స్పష్టం చేసింది. రూ. 10 వేల కోట్లు అడ్‌హక్‌గా ఇచ్చి ప్రాజెక్ట్‌ పూర్తికి సహాకారం అందించాలని కోరారు. సీఎం జగన్‌ విజ్ఙప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh