Jagan Mohan: అమ్మో ఒకటో తారీఖు..

Jagan

Jagan Mohan: అమ్మో ఒకటో తారీఖు..

 

 

Jagan Mohan: అమ్మో ఒకటో తారీఖు… ఈ మాట ప్రైవేటు ఉద్యోగులు, బకాయిలు కట్టాల్సినవాళ్ళు అనుకోవడం పరిపాటే.  కాని ప్రస్తుత తరుణంలో ఒకటో తారీఖు అంటే భయపడే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యఉద్యోగులకు.

ఎందుకంటే ఆ తారీఖు జీతం వస్తుందా రాదా అని ఒకవేళ రాకపోతే ఎప్పుడు వస్తుందో అని చెప్పలేని పరిస్థితి. అబ్బాయిది ప్రభుత్వ ఉద్యోగం అన్న మాటతోనే ఎగిరి గంతేసి పిల్లనిచ్చే తల్లిదండ్రులకు గ్యారెంటీ అతగాడికి ఠంచనుగా ఒకటో తారీఖున ఠంచనుగా వచ్చే నెల జీతం.

 

 

కాని ఇప్పుడా పరిస్థితి మారింది మార్కెట్ లో వున్న సదరు పెళ్ళి కాని ప్రసాద్ లు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పినా వారెంటీ లేని ప్రాడక్ట్ కింద జమ కట్టి ప్రైవేట్ ఉద్యోగుల కోసం వెతుకుతున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.

వైఎస్ జగమ్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటినుండి ప్రభుత్వ ఉద్యోగులలో వున్న ఆర్ధిక ధైర్యం, తెగువ అన్నీ నీరుగారిపోయాయి అన్నది వాస్తవం. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు మాత్రం సకాలంలో జరిగేవి.

కాని ఇప్పుడా పరిస్థతి అస్సలు లేదన్నది కాదనలేని వాస్తవం.  సర్వీస్ లో వున్న వాళ్ళ పరిస్థితి ఇలా వుంటే ఫించను దార్ల పరిస్థితి మరీ దారుణంగా తయరయింది.  ఫించను వస్తే కాని ఇంట్లో బండి నడవని పరిస్థితి.

ఒకటో తారీఖు సరే కనీసం ఏ తారీఖున వస్తుందో అసలు వస్తుందో రాదో తెలీని స్థితి.  నవరత్నాలతో ప్రజల జీవితంలో వెలుగు నింపుతున్న ఓ జగనన్న సరైన సమయానికి జీతం అందేట్టు చూడన్నా అని అంటున్నాడు ప్రభుత్వ ఉద్యోగి.

 

Leave a Reply