EC కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్

EC కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్

EC కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ IAS అరుణ్ గోయెల్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్తో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర పదవీ విరమణ పొందడంతో ఆయన పోస్టును కమిషనర్ ఉన్న రాజీవ్ కుమార్ భర్తీ చేశారు. దీంతో ఓ కమిషనర్ పోస్టు ఖాళీగా మారింది. ఆ స్థానంలో అరుణ్ గోయల్ తాజాగా బాధ్యతలు తీసుకున్నారు.

2.మెగాస్టార్కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారు చెప్పుకోదగిన వ్యక్తి. ఆయన చేసిన గొప్ప పనులు, వైవిధ్యమైన పాత్రలతో పాటు అద్భుతమైన స్వభావం తరతరాలుగా సినీ ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఈ అవార్డును అందుకున్నందుకు ఆయనకు అభినందనలు’ అని కొనియాడారు.

3.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హాజరుకాని

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు నేపథ్యంలో నిందితులకు సిట్ ఇచ్చిన గడువు ముగిసింది. నిందితులు 10:30కి హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ బీఎల్. సంతోష్, తుషార్, జగ్గు స్వామి సిట్ విచారణకు హాజరు కాలేదు. నోటీసులు ఇచ్చిన వారిలో శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. విచారణకు రాకుంటే అరెస్ట్ చేస్తామని నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్నారు.ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమ రిమాండ్ను సవాల్ చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు.. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అటు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు.. హైకోర్టు సింగిల్ బెంచ్ తీరు ఆమోదయోగ్యం కాదని, తామైతే ఇప్పటికే బెయిల్ ఇచ్చి ఉండేవాళ్లమని అభిప్రాయపడింది.

4.టీడీపీ-జనసేనపై జగన్ ధ్వజం AP.

TDPని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని.. జనసేనను రౌడీసేనగా మార్చేశారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘గతంలో వాళ్ల పాలనను చూసి ఇదేం కర్మరా బాబు అని ప్రజలు అనుకున్నారు. అందుకే 2019లో చిత్తుగా ఓడించారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ బాబుకు బై బై చెప్పారు. కుప్పంలోనూ టీడీపీని చిత్తుగా ఓడించారు. ఈ సారి కుప్పంలోనూ గెలవననే భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోంది’ అని జగన్ విమర్శించారు.చంద్రబాబు ప్రతి మాటలో భయం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం జగన్ ఆరోపించారు. ఆ భయంతోనే ఇవే తన చివరి ఎన్నికలని ప్రజలను బెదిరిస్తున్నారని ఎద్దేవా చేసిన జగన్.. ‘కుప్పంలోనే గెలవననేది గ్రహించారు. అందుకే ఆయన మాటల్లో నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ను నమ్మొద్దు. మీకు మంచి జరిగిందా లేదా అనేదే ఆలోచించండి. మంచి జరిగితే ఆశీర్వదించండి’ అని జగన్ కోరారు.

5.క్యాసినో కేసులో ఈడీ ముందు వ్యాపారి బుచ్చిరెడ్డి.

చికోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఈడీ ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారి బుచ్చిరెడ్డి హాజరయ్యారు. 6 నెలల అకౌంట్స్ స్టేట్మెంట్ బుచ్చిరెడ్డి ఈడీ అధికారులకు సమర్పించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి బుచ్చిరెడ్డిని విచారిస్తున్నారు. ఇప్పటికే తలసాని సోదరులను ఈడీ విచారించారు.

6.కూకట్పల్లి ATMలో భారీ అగ్నిప్రమాదం…

కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం పూర్తిగా దగ్ధమవగా పక్కనే ఉన్న ఇతర బ్యాంకుల ఏటీఎం కేంద్రాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఏటీఎం ఎదురుగా పార్క్ చేసిన ఓ బైక్ సైతం పూర్తిగా కాలిపోయింది.

7.క్యూట్ వీడియోను షేర్ చేసిన అల్లు అర్జున్:

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. తన కూతురు అల్లు అర్హా బర్త్ డే విషెస్ తెలుపుతూ షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అర్హ కందిరీగలు కుడతాయి అంటూ తెలుగులో మాట్లాడిన తీరు ఆకట్టుకుంటోంది.

8. ట్విటర్లోకి ట్రంప్ రీ ఎంట్రీ.. నెట్టింట ట్రెండింగ్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్ తిరిగి యాక్టివ్ కావడంతో నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. వేలకొద్ది ట్వీట్లు చేయడంతో ట్విటర్ ట్రెండింగ్లో ట్రంప్ పేరు మారుమోగుతోంది. అయితే, ఇందులో విమర్శలే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో ట్రంప్కు సంబంధించిన మీమ్స్, స్పెషల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ట్రంప్ అకౌంట్ పై మస్క్ చేసిన పోల్ 15 మిలియన్ల మంది అకౌంటపై 1 యూజర్లు పాల్గొన్నారు.

9. FIFA వరల్డ్ కప్ లో మాకు బీర్ కావాలంటూ అరుపులు..

FIFA వరల్డ్ కప్ సందర్భంగా.. మ్యాచ్లు నిర్వహించే స్టేడియాలతో పాటు సమీప ప్రాంతాల్లో మద్యపానాన్ని నిషేధిస్తూ ఖతార్ రాజ కుటుంబం నిర్ణయించింది. కాగా.. ఖతార్, ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. క్వెరెమోస్ సెర్వేజా (మాకు బీర్ కావాలి) అంటూ ఈక్వెడార్ అభిమానులు అరవడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నిర్వాహకులు ఖంగుతిన్నారు.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh