Vishnuvardhan Reddy: కొడాలి నానికి సవాల్

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy: కొడాలి నానికి విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్

Vishnuvardhan Reddy: ఏపీలో బీజేపీ ఏపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యల తర్వాత గుడివాడలో రాజకీయాలు వేడెక్కాయి.

తాజాగా మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.

విశాఖలో మీడియాతో మాట్లాడిన  విష్ణువర్ధన్ రెడ్డి  మాజీ మంత్రి కొడాలి నాని భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు గుడివాడ బస్టాండ్ దగ్గరకు వస్తే బహిరంగ చర్చ పెడదామని కొడాలి నానికి సవాల్ చేశారు.

Also Watch

Tirumala: భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు

ప్రజా చార్జిషీట్లో ఉన్న అంశాలపై చర్చకు తాము సిద్ధమంటూ పేర్కొని, మాజీ మంత్రి కొడాలి నాని వచ్చినా , లేదా కట్టకట్టుకుని వైసిపి నేతలందరూ వచ్చినా, తాము చర్చకు సిద్ధమన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చామని.. కనీసం గుడివాడలోనైన పూర్తయ్యాయని చెప్పగలరా అంటూ సవాల్‌ చేశారు.

2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ, తమ బంధువుల ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో బయట పెట్టాలన్నారు.

2024లో బీజేపీ నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతోందని విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు.

ఇక ఇదే సమయంలో టీడీపీని టార్గెట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి గతంలో మోడీని ఓడించాలని పిలుపునిచ్చిన పార్టీ ఇప్పుడు తమతో పొత్తు కోసం వెంపర్లాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే ఏపీలో తాగడానికి నీళ్లు లేవు.. కానీ, మద్యం మాత్రం ఏరులై పారుతోందని విమర్శించారు.

శుక్రవారం  గన్నవరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుతోంది. 2024 ఎన్నికల మీద కీలకమైన చర్చ జరుగుతుందని..

భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ వ్యవహరించాల్సిన తీరు సహా పలు అంశాలపై కీలక చర్చ జరుగుతుందని ప్రకటించారు.

విష్ణువర్ధన్ రెడ్డి సవాల్‌పై కొడాలి నాని ఎలా స్పందిస్తారోనని రాజకీయవర్గాలలో  ఉత్కంఠ మొదలైయింది.

అసలు గుడివాడలో సమస్యలు లెక్కలేనన్ని ఉన్నాయని అక్కడి ప్రజలు ప్రజా చార్జిషీట్‌లో భాగంగా  బీజేపీ నేతలకు ఫిర్యాదులు ఇచ్చారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh