Tirumala: భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు

Tirumala

Tirumala: తిరుమలలో భారీ వర్షం, తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు

Tirumala: ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం 6 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి.   కానీ తిరుమలలో ఈ రోజు వాతావరణం ఒక్కసారిగా మారింది.

తిరుమలలో(గురువారం) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్రవస్థలు పడ్డారు.

అయితే ఇప్పుడు వేసవి సెలవులు కావటంతో స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో దర్శనం కోసం కిలో మీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు దాదాపు మూడు కిలో మీటర్ల మేర భక్తుల లైన్లు కొనసాగుతున్నాయి.

Also Watch

Italy Floods: ఉత్తర ఇటలీలో వరదలు 8 మంది బలి

పెగిరిన రద్దీతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. దర్శనం కోసం 36 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు. భక్తులకు కావాల్సిన అన్నప్రసాదం, మంచి నీరు అందిస్తున్నారు.

అయితే భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక సూచన చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాల లేఖలను తగ్గించాలని సూచించింది.

జూన్ 15వ తేదీ వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా నిర్ణీత తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయించింది.

ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.

20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే సోమవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

క్యూలైన్లలో ఉన్న వారికి 20 గంటల్లో దర్శనం లభించనుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఆదివారం 87,022 మంది భక్తులు దర్శించుకుంటు సోమవారం 70,366మంది భక్తులు స్వామి వారిని దర‌్శించుకున్నారు.

శ్రీవారి హుండీల ద్వారా రూ.4.32కోట్ల రుపాయల విరాళాలు వచ్చాయి. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో శ్రీవారి దర్శన సమయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh