మహిళలు హ్యాండిల్ చేస్తున్న ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఈరోజు మహిళలే ఆపరేట్ చేస్తున్నారు. వివిధ రంగాల్లో సక్సెసైన ఉమెన్ అచీవర్స్ మోదీ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాండిల్ చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం 2020లో కూడా మోదీ ఇలానే చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఓ నిర్ణయం తీసుకున్నారు. నారీ శ‌క్తికి వంద‌నం తెలుపుతూ ఇవాళ మోదీ త‌న అకౌంట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. మహిళలకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్స్ మహిళలే హ్యాండిల్ చేస్తారని ప్రకటించారు.

వివిధ రంగాల్లో సక్సెస్ అయిన స్త్రీలు మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఆప‌రేట్ చేస్తున్నారు. మ‌హిళా సాధికార‌త కోసం త‌మ ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు ప్రధాని. వివిధ ప్రభుత్వ ప‌థ‌కాలు, కార్యక్రమాల ద్వారా మ‌హిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మార్చి 8న ప్రపంచ మ‌హిళా దినోత్సవం నేప‌థ్యంలో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ లో స‌క్సెస్‌ఫుల్ మ‌హిళ‌లు పోస్టు చేయ‌నున్నట్లు చెప్పారు. న్యూక్లియర్ సైంటిస్ట్ ఎలినా మిశ్రా, స్పేస్ సైంటిస్ట్ శిల్పి సోని, చెస్ గ్రాండ్ మాస్టర్ వైశాలి, సెల్ఫ్ ఎంప్లాయి అనిత అనే మహిళలు ఈరోజు మోదీ సోషల్ మీడియా అకౌంట్లు ఆపరేట్ చేయనున్నారు. ఈరోజు వరకు వారే ఆ ఖాతాల్లో పోస్టులు చేస్తున్నారు.

గ‌తంలో కూడా మ‌హిళా దినోత్సవం రోజు మోదీ సోషల్ మీడియా ఆపరేటింగ్ మహిళలకు ఇచ్చారు.2020 మార్చి 8న కూడా ఇలాగే జరిగింది. ఆ ఏడాది ఏడుగురు వుమెన్ అచీవ‌ర్స్ ప్రధాని మోదీ అకౌంట్‌ను ఆప‌రేట్ చేశారు. మ‌హిళ‌ల్లో ప్రేర‌ణ తీసుకువ‌చ్చే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని చేప‌ట్టామని మోదీ అన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh