PM Modi Road Show: నేడు బెంగళూరులో ప్రధాని మోదీ రోడ్ షో.. ఆసక్తికరమైన ట్వీట్..
PM Modi Road Show: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నేపధ్యం ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ దూసుకుపోతున్నారు బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బెంగళూరులో భారీ రోడ్ షో చేపట్టారు. మొత్తంగా 26 కి.మీ మేర ప్రధాని మోదీ రోడ్ షో సాగనుంది. ప్రధాని మోదీ రోడ్ షోకు ప్రజల నుంచి విశేషణ స్పందన లభిస్తుంది. దారి పొడుగున బీజేపీ శ్రేణులు, ప్రజలు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తున్నారు. మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ రోడ్ షో నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. బెంగళూరు, బీజేపీ మధ్య పాత, బలమైన బంధం ఉందని చెప్పారు. బీజేపీకి తొలినాళ్ల నుంచి బెంగళూరు నగరం మద్దతిస్తూనే ఉందని పేర్కొన్నారు. బెంగళూరు అభివృద్దికి తాము అనేక ప్రయత్నాలు కూడా చేశామని తెలిపారు.
‘‘మేము మా ట్రాక్ రికార్డ్‌తో పాటు ఇప్పటివరకు సాధించిన విజయాలను మరింత పెంచుకుంటామని వాగ్దానం చేస్తున్నాం. ఈ వాగ్దానం ఆధారంగా బెంగళూరు ప్రజల దీవెనలు కోరుతున్నాము. కర్ణాటకను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడంతోపాటు బెంగళూరు అభివృద్ధి పథంలో అసమానమైన ఊపును అందించడం మా ప్రయత్నం. హెల్త్‌కేర్, హౌసింగ్, పారిశుధ్యం.. ఇలా ప్రతిదానిలో బెంగళూరులో గణనీయమైన మార్పు వచ్చింది ఆయన అన్నారు.
ఇక బెంగళూరులో PM Modi Road Show కు 8, 000 మంది పోలీసులు నియమించారు. బెంగళూరు నగరంలో ఇంత వరకు ఇంత పెద్ద రోడ్ షో ఏ ప్రధాన మంత్రి నిర్వహించలేదని, ఆ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో బెంగళూరులోని కోణెణకుంటే నుడి మొదలైంది.
అక్కడి నుంచి జేపీ నగర్, జయనగర్, జయనగర్ మెట్రో స్టేషన్, మాదవరావ్ సర్కిల్, సౌత్ ఎండ్ సర్కిల్ లో ప్రధాని మోదీ సందడి చెయ్యనున్నారు. అక్కడి నుంచి రమణ మహర్షి రోడ్డు, ఆర్ బీఐ లేఔట్, రోస్ గార్డెన్, శిర్సీ సర్కిల్, జేజే నగర్, బిన్నిమిల్ రోడ్డు, షాలిని గ్రౌండ్స్, అర్ముగం సర్కిల్ మీదుగా మోదీ రోడ్ షో నిర్వహిస్తారు.
సౌత్‌లోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరంలోని సాంకీ ట్యాంక్ వరకు రోడ్‌షో కొనసాగనుంది. దాదాపు మూడున్నర గంటల్లో రోడ్ షో పూర్తి అవుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక, ప్రధాని వెంట బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ ఆదివారం తిప్పసంద్ర వద్ద కెంపేగౌడ విగ్రహం మధ్య నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్ షో చేపట్టనున్నారు.
Our Party’s ideology revolves around development, development and more development. We are sensitive to social justice needs and we have a concrete vision for the future. Here are some of the achievements over the last 4 years which we have transformed many lives. pic.twitter.com/j02zxELsUu
— Narendra Modi (@narendramodi) May 6, 2023