pawan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్‌..

pawankalyan ఏపీలో మెగా ఫ్యామిలీపై బీజేపీ ఫోకస్‌.. తరచుగా బీజేపీ నేతలతో టచ్‌లో పవన్‌, చిరు..

pawan మళ్లీ రాజకీయాల జోలికి రానుంటూనే ఏదో రూపంలో మెగా హీరో చిరంజీవి ఏపీ పొలిటికల్‌ పిక్చర్‌లో తరచుగా కనిపిస్తున్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారారు చిరంజీవి. ప్రధానితో పర్సనల్‌ ముచ్చట్లతో టాక్‌ ఆఫ్‌ ది ఏపీ అయ్యారు. తర్వాత సినిమా ప్రమోషన్‌లో భాగంగా డైలాగులు లీక్‌ చేసి మరీ చర్చకు తావిచ్చారు.

తాజాగా తన తమ్ముడిని Pawan ఏదోరోజు అత్యున్నత స్థానంలో చూస్తామంటూ ప్రకటించి సంచలనంగా మారారు. అన్నా తమ్ముళ్లు ప్రధానిని కలిసిన తర్వాత మెగా ఫ్యామిలీ విషయంలో బీజేపీ ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తుందన్న ప్రచారం నడుస్తోంది. తాజాగా ఆయనకు ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రావడం దీనికి ప్రధాని నుంచి కిందిస్థాయి నేతల వరకూ బీజేపీ నుంచి అభినందనలు రావడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి చిరు సాయం తీసుకుంటున్నారా?

2.ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు – ఢిల్లీ బీజేపీ లెక్క పక్కా..!

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు. సీఎం జగన్ వై నాటు 175 అని ధీమాగా చెబుతున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు మాదే అంటున్నారు. ఇక, ఒక్క ఛాన్స్ అంటూ పవన్ ప్రజల ముందుకు వస్తున్నారు. బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. అయితే, ఈ ఫలితం ఈ సారి పొత్తులే డిసైడ్ చేస్తాయనేది సుస్పష్టం. జనసేన -బీజేపీతో కలిసి వెళ్లాలనేది టీడీపీ ఆలోచన. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. రెండు పార్టీల మధ్య పవన్ కల్యాన్ ఎవరితో ఉండాలనే దాని పైన తర్జన భర్జన పడుతున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతల అంచనాలు ఏంటనేది స్పష్టం అవుతోంది.

ఏపీలో ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్లు అధికారానికి ఢోకా లేదనేది సీఎం జగన్ అంచనా. అదే పార్టీ నేతలతో ఓపెన్ గానే చెబుతున్నారు. ఈ సారి గెలిస్తే సరి..గెలవకపోతే ఇవే చివరి ఎన్నికలనేది చంద్రబాబు చెబుతున్న విషయం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పిన పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ తరువాత..కొంత అసౌకర్యంగా కనిపిస్తున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. ఆ తరువాత ప్రధాని మోదీని ఓడించేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ తో జత కట్టారు.

అదే విధంగా ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతీ సందర్భంలోనూ అప్పటికి కొన్ని సీట్లు మినహా..క్షేత్ర స్థాయిలో బలోపేతం కాలేదనేది కమలం పార్టీ నేతల వాదన. తాజాగా ప్రధాని విశాఖ పర్యటన సమయంలోనే మన పార్టీ మనకు ముఖ్యమని ఏపీ బీజేపీ కోర్ నేతలకు తేల్చి చెప్పారు. జనసేనానితో సమావేశం సమయంలోనూ రెండు పార్టీల మధ్య మైత్రి గురించే ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.టీడీపీతో జత కట్టేందుకు ప్రధాని సిద్దంగా లేరనే విషయం జనసేనానికి ఆ నిమిషంలోనే అర్దమైందని చెబుతున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలనేది పవన్ కల్యాణ్ లక్ష్యం.

టీడీపీతో కలవకూడదనేది బీజేపీ నిర్ణయం. ఇదే సమయంలో బీజేపీ నేతల అసలు వ్యూహం ఏంటనే దాని పైన స్పష్టత వస్తోంది. టీడీపీ – జనసేన కలిస్తే వైసీపీకి గట్టి పోటీ ఉంటుందని, కూటమి కట్టకపోతే వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదే అంచనాలతో బీజేపీ ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బీజేపీ ఏపీలో అసలు టార్గెట్ 2029 గా చెబుతున్నారు. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే మరింతగా బలపడి..తమ స్పేస్ తగ్గుతుందని ఆ పార్టీ నేతల అంచనా. దీంతో, ఈ సారి వైసీపీ గెలిచినా..పవన్ సహకారంతో 2029 ఎన్నికల నాటికి బీజేపీ – జనసేన కూటమి టీడీపీ స్థానంలో నిలుస్తుందనే విశ్లేషణలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారు.

 

3.జగన్ కల జనసేనకు వరమవుతుందా ?తెలంగాణ స్టోరీ రిపీట్ !

ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన తర్వాత అధికారం నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలు కీలకంగా మారాయి. జగన్ కు వ్యతిరేకంగా విపక్ష పార్టీలను కూడగట్టేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో క్షేత్రస్దాయిలో మారుతున్న పరిస్ధితులు టీడీపీ అధినేత చంద్రబాబును సైతం పవన్ మద్దతు కోసం ప్రయత్నించేదాకా తీసుకెళ్లాయి. అటు బీజేపీ కూడా పవన్ ను వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఈ పరిస్దితి భవిష్యత్తులో ఎలా మారబోతోందన్న చర్చ మొదలైంది.

ఏపీలో 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు పరిమితమైన టీడీపీ పనైపోయిందని ఓవైపు చెప్తూనే, మరోవైపు ఆ పార్టీని క్షేత్రస్దాయిలో నామరూపాల్లేకుండా చేసేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలపై కేసులు, దాడుల రూపంలో భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికార వైసీపీ.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మూడు రాజధానుల ప్రక్రియ అమల్లోకి వస్తే ఎలాగో టీడీపీ అడ్డు తొలగిపోతుందని జగన్ ధీమాగా ఉన్నారు. అయితే జగన్ వ్యూహాలు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీయబోతున్నాయి.ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న టీడీపీని నామరూపాల్లేకుండా చేసేందుకు వైసీపీ అధినేత అమలు చేస్తున్న వ్యూహాలు మరో విపక్ష పార్టీ జనసేనకు మేలు చేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సాయంతో రాష్ట్రంలో ఎదిగేందుకు దారులు వేసుకుంటున్న జనసేనకు వైసీపీ ప్రయత్నాలు వరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా టీడీపీ విఫలమైతే ఆ స్ధానంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. దాన్ని భర్తీ చేసేందుకు వరుసలో టీడీపీ తర్వాత ఉన్న పార్టీగా జనసేనకు ఆ అవకాశం లభించడం ఖాయం. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

4.కేసీఆర్ పై మరోపోరుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్..

తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు యుద్ధం చేయడానికి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పాటు కెసిఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించిన రేవంత్ రెడ్డి అందులో భాగంగా పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఓటమిని సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు…

ఇక తాజాగా గాంధీ భవన్ నుంచి జూమ్ మీటింగ్లో నేతలతో కీలక సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులతో మాట్లాడారు. ప్రజల మద్దతు కూడగట్టడం కోసం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు.రాష్ట్రంలో తాజా పరిస్థితుల్లో ధరణి పోర్టల్ పైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ధాన్యం కొనుగోలు సమస్యలపైన, పోడు భూముల సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈమేరకు కార్యాచరణను కూడా రూపొందించి అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.

 5.ఎన్నికల్లో జరిగేదిదే …టీడీపీ స్ట్రాటజిస్ట్ రాబిన్…!!

టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ తెర ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు పార్టీకి తెర వెనుక వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శర్మను టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు పరిచయం చేసారు. పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాబిన్ శర్మ తాజాగా పార్టీ ప్రకటించిన ఇదేం ఖర్మ కార్యక్రమం గురించి వివరించారు. 2019 ఎన్నికల సమయంలో నాడు జగన్ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్ టీంలో రాబిన్ శర్మ క్రియాశీలకంగా వ్యవహరించారు.పీకే బృందం నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఒక సంస్థను ఏర్పా టు చేసుకొని వివిధ పార్టీలకు పనిచేస్తున్నారు.

రాబిన్‌ను తీసుకు న్న తర్వాత కొంతకాలం కిందట టీడీపీ నాయకత్వం సునీల్‌ కనుగోలు అనే మరో వ్యూహకర్తను కూడా నియమించుకుంది. అయితే సునీల్‌కు ఏపీ పై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించే సమయం లేకపోవడంతో టీడీపీ ఆయనను పక్కన పెట్టింది. సునీల్ కనుగోలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ సమావేశంలో రాబిన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో వివరించారు. వైసీపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారనే అభిప్రాయం వ్యాప్తి చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఇచ్చిన హామీలన్నీ అమలు చేసామంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని గుర్తు చేసారు. ఇప్పుడు అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రచార వ్యూహం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పైన సానుకూలత పెంచుకొనే ప్రయత్నం చేస్తుందని విశ్లేషించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు కౌంటర్ గా ప్రతిపక్ష పార్టీగా కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. పథకాలు..ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రచారం వైసీపీ బలంగా భావిస్తోందని చెప్పుకొచ్చారు. అయితే, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలగా మలచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రచార వ్యూహానికి ధీటుగా..

ప్రజా సమస్యల పైన పోరాటం అవసరమని నిర్దేశించారు. ఎన్నికల వరకు నేతలంతా ప్రజల్లోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.ప్రజా సమస్యలను ప్రతిపక్ష పార్టీగా బయట పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో మమేకం అవుతూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. టీడీపీ ఎన్నికలకు సిద్దంగా లేదనే అభిప్రాయంతో వైసీపీ ఉందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని ఇదే సమయంలో చంద్రబాబు స్పష్టం చేసారు. తాజాగా ప్రకటించిన ఇదేం ఖర్మ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పై ఎన్నికల సమరశంఖం పూరించినట్లుగా పార్టీ ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా రాబిన్ శర్మ టీం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ..కావాల్సిన వ్యూహాలను.. ప్రచార తీరు పైన పార్టీకి సూచనలు అందిచనుంది.

6.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు బీజేపీ ప్లాన్ ఇదే..

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం ఏడాదికి పైగా గడువు ఉన్నా.. ఇప్పటినుంచే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుంటే.. కారు పార్టీ, కమలం పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటినుంచే నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. సీఏం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్‌గా బీజేపీ విమర్శలు చేస్తుంటే.. టీఆర్‌ఎస్ నాయకులు కేంద్రంలో మోదీ ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శల బాణాన్ని ఎక్కుపెడుతున్నాయి.

ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్‌ తనదైన వ్యూహలకు పదును పెడుతూ ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీపడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య నిధుల విషయంలో గత కొంతకాలంగా మాటలయుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపిస్తోందని టీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను రాష్ట్రానికి కేటాయించినట్లు బీజేపీ చెప్తోంది.

అన్ని రాష్ట్రాలతో సమానంగా చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు మినహా ఒక్కరూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. బీజేపీ మాత్రం జాతీయ రహదారులు మొదలు, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల వరకు అనేక ప్రాజెక్టులు తెలంగాణకు కేటాయించామని స్వయంగా కేంద్రమంత్రులే చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు శాపంగా మారాయని కమలం పార్టీ అంటుంటే.. మోదీ విధానాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని టీఆర్‌ఎస్ చెబుతూ వస్తోంది.

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి టిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహలను రూపొందిస్తోంది. ప్రధానంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలంగా ఢీకొట్టగలిగే శక్తి తమకే ఉందని నిరూపించుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను కమలం పార్టీ చేస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకులను, టీఆర్‌ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమవైపు మళ్లే విధంగా వ్యూహలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటిరవకు కేంద్రప్రభుత్వం ఏ ప్రాజెక్టులను మంజూరు చేసింది, ఎంత నిధులు కేటాయించిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజలందరికి.. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తెలియజేస్తామని చెప్పింది.రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ ఇప్పటికే అనేకసార్లు టీఆర్‌ఎస్.. బీజేపీకి సవాల్ చేసింది. ప్రతిగా బీజేపీ నాయకులు కూడా తాము సిద్ధమే అంటూ కండీషన్స్ పెట్టడంతో ఆ సవాళ్లు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రానున్న ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh