కోటి డౌన్‌లోడ్స్‌ చేరుకోనున్న ఎఫ్‌ ఫ్రీడం యాప్‌

కోటి డౌన్‌లోడ్స్‌ చేరుకోనున్న ఎఫ్‌ ఫ్రీడం యాప్‌

ఆన్‌లైన్‌లో జీవనోపాధి విద్యను అందిస్తున్న ఎఫ్‌ ఫ్రీడం యాప్‌ కోటి డౌన్‌లోడ్స్‌ మైలు రాయిని చేరుకుంది. 33 నెలల్లోనే ఘనత సాధ్య మైందని ఫ్రీడం యాప్‌ సీఈఓ సుధీర్‌ ప్రకటిం చారు. బెంగళూరు లో బుధవారం ఈ మేరకు ఫ్రీడంయాప్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కోటి డౌన్‌లోడ్‌లు సాధ్య మయ్యేందుకు సహకరించినవారికి ధన్యవాదాలు తెలిపారు సుదీర్ గారు.  దేశమంతటా రైతులు, చిన్నవ్యాపారులు ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి, సాధికారతను సాధ్యం చేసే విప్లవాత్మకమైన వేదిక ఫ్రీడం యాప్‌ అన్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా కోటి మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ది, అభివృద్ధికి కీలకమైన వ్యక్తులకు జీవనోపాధి విద్యను అందించడంలో మార్కెట్‌ లీడర్‌గా ఫ్రీడం యాప్‌ దోహదం చేస్తోందన్నారు. యాప్‌ ద్వారా విని యోగదారులలో కొత్త ఆలోచనలు కలిగించి అందరికి  కనెక్ట్‌ అయ్యే అవకాశాన్ని అందిస్తోందన్నారు. ఈ ప్లాట్ పామ్ పై తమ ఉత్పత్తులు, వ్యాపారాన్ని ప్రదర్శించి కావా ల్సినవారికి విక్రయించుకోవచ్చునన్నారు. వస్తువు ధర తయారీ వ్యక్తి ఇష్టంపై ఆధార పడి ఉంటుందన్నారు. ఫ్రీడంయాప్‌ 18 యూట్యూబ్‌ చానెళ్లను నిర్వహిస్తోందని, 25 మిలియన్‌లకంటే ఎక్కువమంది సబ్‌స్ర్కైబర్‌లు కలిగి ఉందన్నారు. ఫ్రెండ్లీ ఇంటర్‌ ఫేజ్‌ ద్వారా యువతను ఈ యాప్‌ ఆకర్షిస్తోందని, సమగ్ర పాఠ్యాంశాలతో దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజల జీవితాలను మెరుగు పరచడంలో గణనీయమైన ప్రభావం చూపుతోందన్నారు. 2020 మార్చి 20న యాప్‌ను ప్రారంభించామని, తొలుత ఫోన్‌కాల్స్‌ ద్వారా ఆర్థిక పరమైన సమస్యలను తెలిపే ప్లాట్‌ఫాంగా పని చేసిందన్నారు. కొత్త ఫీచర్‌లతో తక్కువ సమయంలోనే కోటి మందికి చేరువైంది అని అన్నారు. యాప్‌లో కోర్సులుమొత్తం  ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం వంటి ప్రాంతీయభాషలలో అందుబాటులో ఉండడమే అన్నివర్గాలను ఆకర్షించేందుకు కారణమవుతోందన్నారు. ప్రస్తుతం యాప్‌ ద్వారా వ్యవసాయం, వ్యాపారం వ్యక్తిగత ఫైనాన్స్‌ అనే మూడు విభాగాలలో 960 కోర్సులను అందిస్తోందన్నారు. కోర్సుల ద్వారా 37 సమగ్రమైన లక్ష్యాలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. రానున్న ఏడాదిన్నరలో వంద మిలియన్‌లమందిని వినియోగ దారులను చేర్చుకునే లక్ష్యంగా ఉన్నామన్నారు సీఈఓ సుధీర్‌ గారు.

ఇది కూడా చదవండి:

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh