Tollywood: జూన్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం

Tollywood

Tollywood: జూన్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం

Tollywood: టాలీవుడ్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల మధ్య ప్రేమాయణం నడుస్తోందని గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడినట్లు తెలుస్తోంది.

జూన్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థ వేడుక, ఆ తర్వాత 2023 చివర్లో వివాహం జరగనున్నందున ఈ జంట తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కలయికకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం అభిమానులు, మీడియా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే  ఈ జంట గతంలో వివిధ పార్టీలు మరియు కుటుంబ కార్యక్రమాలలో కలిసి కనిపించింది, కాని వారు ఎల్లప్పుడూ రిలేషన్షిప్లో ఉండడాన్ని ఖండించారు, కాని వారు “కేవలం స్నేహితులు” అని పేర్కొన్నారు.

Also Watch

Sharwanand: వస్తున్న పుకార్లు పై స్పందించిన చిత్ర బృందం

గత కొంత కాలంగా తమ అభిమానులను, మీడియాను ఉర్రూతలూగించిన ఈ జంట ఎట్టకేలకు మరో అడుగు ముందుకేసి తమ రిలేషన్ షిప్ ను అఫీషియల్ గా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం, పెళ్లి వేడుకలకు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.

రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయితేజ్, పంజా వైష్ణవ్ తేజ్ వంటి ఇండస్ట్రీ ప్రముఖులు వరుణ్ తేజ్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే వరుణ్ సోదరి నిహారిక కొణిదెలతో లావణ్య త్రిపాఠికి ప్రత్యేక అనుబంధం ఉంది.

గతంలో ఒకసారి మోస్ట్ హాండ్సమ్ ఎవరూ అని లావణ్యను అడిగితే వరుణ్ తేజ్ అని ఠక్కున సమాధానం చెప్పింది లావణ్య.

సుమ వేసిన ప్రశ్నలో నాని, వరుణ్ తేజ్ అనే ఇద్దరి పేర్లను ఆప్షన్ కింద ఉంచింది.

ఒక్కటవుతున్న  జంట నిజమేనా

కానీ వెంటనే లావణ్య వరుణ్ పేరు చెప్పడంతో వీరి లవ్ పై గతంలోనే క్లారిటీ వచ్చినట్టుగా అయింది. కానీ ఇద్దరు కూడా ఈ విషయాన్ని ఒప్పుకోలేదు.

ఇక ఈ మధ్యే నాగబాబు కూడా వరుణ్ తేజ్ పెళ్లి కబురు త్వరలోనే చెబుతాం అనడం కూడా దీనికి సంకేతం అని అనుకున్నారు. ఇక ఈ ప్రశ్నలన్నీటికి సమాధానంగా వీరి నిశ్చితార్థం వార్తలు సంతోషాన్ని ఇస్తున్నాయి అభిమానులకు.

మరి త్వరలో ఈ జంట మరెలాంటి అప్ డేట్ ఇవ్వబోతోంది అనేది కూడా ప్రస్తుం ఆసక్తిగా మారింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం అనే రెండు సినిమాల్లో నటించారు.

ఈ రెండు సినిమాల్లో మిస్టర్ డిజాస్టర్ గా నిలిచింది. అంతరిక్షం మాత్రం యావరేజ్ అనిపించుకుంది.

అదలా ఉంచితే ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండివాదన అర్జున  ఒకటైతే, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తన 13వ చిత్రాన్ని చేస్తున్నాడు.

లావణ్య త్రిపాఠి ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంటోన్న ఈ సొట్టబుగ్గల సుందరికి వరుస ఆఫర్లు వచ్చాయి.

‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్ సురవరం’, ‘చావు కబురు చల్లగా’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అనతికాలంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాలు అందుకున్నారు.

Leave a Reply