Vijayawada: అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

Vijayawada

Vijayawada: అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌

Vijayawada: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్సన సహిత శ్రీ మహాలక్ష్మీ యజ్ణం ముగింపునకు చేరుకుంది.

బుధవారం జరిగిన అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ys Jagan) పాల్గొనగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

ఏపీ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి  రాష్ట్ర ప్రభుత్వం అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తోంది.

Also Watch

Tollywood: జూన్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం

మొదటి రోజు సీఎం వైఎస్‌ జగన్‌ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంకల్పం తీసుకొని ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు.  ఈ మహాయజ్ఞం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిం ది.

బుధవారం పండితులు నిర్ణయించిన సుముహూర్తాన తిరిగి సీఎం జగన్‌ పాంచరత్న, వైదిక స్మర్త, వైఖానస, శైవాగమ యాగశాలల్లో అఖండ పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

పలు ప్రాంతాల్లో పూజలు

వారం రోజుల పాటు ఎంతో వైభంగా యజ్ఞం జరిగింది. మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిగాయి.

ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు..తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం కొనసాగింది. అనంతరం అఖండ దీపారాధనలో సీఎం పాల్గొన్నారు.

వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు నిర్వహించారుయజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరిగాయి.

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh