Telugu Indian Idol 2: కంటెస్టెంట్ ను అభినందించిన హరీష్ రావు

Telugu Indian Idol 2

Telugu Indian Idol 2: కంటెస్టెంట్ ను అభినందించిన హరీష్ రావు

Telugu Indian Idol 2: ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, సూపర్ హిట్ సినిమాలతో పాటు టాక్ షోలు, గేమ్ షోలతో అలరిస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఈ క్రమంలోనే పుట్టుకతో పరిచయమయ్యే  సంగీతంలోని భావోద్వేగాలను, దానికి సంబంధించిన అత్యుత్తమ కథనాలను మనసులను గెలుచుకునే రీతిలో ప్రసారం చేస్తోంది ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2’. సంగీత ప్రియుల్లో అత్యద్భుతమైన ఆదరణ పొందిన కార్యక్రమం ఇది.ఇది. సంగీత ప్రముఖులైన శ్రేయా ఘోషల్‌, విశాల్‌ దడ్లానీ, హిమేష్‌ రేష్మియా, జీవీ ప్రకాష్‌, దేవిశ్రీ ప్రసాద్‌ వంటి ప్రముఖ సెలబ్రిటీలతో సహా సంగీత ప్రియులలో ఈ షో భారీ ఫాలోయింగ్ సంపాదించింది.

తాజాగా ఈ షోలో లాస్య ప్రియ నటనను ప్రశంసిస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2లో ఇలాంటి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడం ఆనందంగా ఉంది. లాస్య ప్రియ వాయిస్ తనను విస్మయానికి గురిచేసిందని, ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని ట్వీట్ చేశారు.

ఈ షోలో టాప్ 7 కంటెస్టెంట్లలో ఒకరైన లాస్య ప్రియ తన పాపులర్ తెలుగు పాటలతో న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె నటనకు న్యాయనిర్ణేతల నుండి అధిక ప్రశంసలు లభించాయి, మరియు ఆమె ఫ్యాన్ బేస్ ప్రతి వారం క్రమంగా పెరుగుతోంది. ఈ షో ముందుకు సాగుతున్న కొద్దీ కంటెస్టెంట్ల నుంచి ప్రేక్షకులు మరింత ఆకర్షణీయమైన ప్రదర్శనలను, దేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల నుంచి మరింత ప్రశంసలు, చప్పట్లు ఆశించవచ్చు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh