Dhee – Chaitanya: యువ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య

Dhee - Chaitanya

Dhee – Chaitanya: యువ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య

Dhee – Chaitanya: తెలుగు కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30 ఆదివారం ఆత్మహత్య చేసుకున్నరు. అప్పులు తీర్చలేక చైతన్య నెల్లూరులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 30న నెల్లూరులోని ఓ హోటల్లో చైతన్య మాస్టర్ ఆత్మహత్యకు చేసుకోవడంతో ఆయన అకాల మరణవార్త తెలుసుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలుగు బుల్లితెరపై ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ఢీలో కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈటీవీలో సూపర్ హిట్ డాన్స్ కాంపిటీషన్ గా వచ్చిన ఈ షో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఎంతో మంది టాలెంటెడ్ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు స్ఫూర్తి నిచ్చారు చైతన్య.

మరణానికి ముందు చైతన్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఒక వీడియోను షేర్ చేశారు. అప్పులు తీర్చలేకపోయానని, అందువల్ల ఆర్థిక బాధ్యతల భారంగా భావిస్తున్నానని ఆ వీడియోలో వెల్లడించాడు. మా అమ్మ, నాన్న, చెల్లి నన్ను ఎలాంటి సమస్యలు రాకుండా బాగా చూసుకున్నారు. నా స్నేహితులందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు.

నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను, అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. డబ్బు విషయంలో నా మంచితనాన్ని కోల్పోయాను. రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండాలి. కానీ నేను చేయలేకపోయాను. ప్రస్తుతం నేను నెల్లూరులో ఉన్నాను, ఇదే నా చివరి రోజు. అప్పుల బాధలు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు రోజుల క్రితం ఢీ షోలో తన పార్ట్నర్ రంజిత్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘డోంట్ మిస్ మోడల్ పెర్ఫార్మెన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.చైతన్య మరణవార్త తెలియగానే పలువురు అభిమానులు ట్విటర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కొరియోగ్రాఫర్ కు నివాళులు అర్పించారు. ఢీ షో ద్వారా తెలుగు, తమిళ చిత్రాలకు డాన్స్ అసిస్టెంట్లుగా, కొరియోగ్రాఫర్లుగా స్థిరపడిన పలువురు డ్యాన్సర్లు ఉన్నారు. చైతన్య వృత్తిపరంగా కూడా బాగానే ఉన్నప్పటికీ ఆర్థిక భారాలు రావడంతో హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం.

 

Leave a Reply