BJP: అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ

BJP

BJP: అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ

BJP: ఏప్రిల్ 23 (ఆదివారం) చేవెళ్లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమర శంఖాన్ని వూదేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఆయన నోటి నుంచి మాటలన్ని ఒక ఎత్తు అయితే.. తాము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంతనే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారని.. వాటిని తాము పవర్లోకి వచ్చినంతనే తక్షణమే రద్దు చేస్తామని స్పష్టం చేయటమేకాదు.. అలా రద్దు చేసిన రిజర్వేషన్ ఫలాల్ని ఎవరికి అందిస్తామన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

ముస్లింలకు రద్దు చేసిన రిజర్వేషన్లను ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీలకు దక్కేలా చేస్తామన్న అమిత్ షా మాటలు మంట పుట్టించేలా మారాయి. దీంతో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఎజెండా ఏమిటన్న విషయాన్ని స్పష్టం చేశారు అమిత్ షా. ఎంత మొత్తుకున్నా మైనర్టీలు ఓట్లు వేయని తమకు వారి చుట్టూ రాజకీయం నడపాల్సిన అవసరం లేదన్న విషయం మీద స్పష్టమైన ధోరణి ఉన్నట్లుగా అర్థమవుతుంది. అదే సమయంలో మైనార్టీలను దూరం చేసుకున్న వేళ ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీలను అక్కున చేర్చుకునే విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటం ద్వారా.. కొత్త వర్గాల్ని వీలైనంతగా ఆకర్షించాలన్నదే BJP ఉద్దేశమన్నది అర్థమవుతుంది.

మజ్లిస్ మీద ఘాటుగా రియాక్టు అవుతూ.. ఎంఐఎం చెప్పినట్లే కేసీఆర్ పాలన సాగిస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేయటం ద్వారా తమ లక్ష్యం ఏమిటన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని.. మజ్లిస్ కు భయపడే కేసీఆర్ సర్కారు వేడుకల్ని నిర్వహించటం లేదని స్పష్టం చేవారు.

అమిత్ షా వ్యాఖ్యలపై ఒవైసీ స్పందించారు.తెలంగాణలో BJP అధికారంలోకి రాగానే ముస్లింలకు కేటాయించిన రిజర్వేషన్లను తొలగిస్తామని, ముస్లిం వ్యతిరేక ప్రసంగాలతో పాటు బీజేపీకి తెలంగాణపై విజన్ లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు

ముస్లిం వ్యతిరేక విద్వేషపూరిత ప్రసంగాలు తప్ప బీజేపీకి తెలంగాణపై విజన్ లేదని ఎంఐఎం చీఫ్ ట్వీట్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లు, హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూలు, నేరస్థులు, బుల్డోజర్లను విడుదల చేయడం మాత్రమే వారు ఇవ్వగలరు. తెలంగాణ ప్రజలను ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు.

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై అమిత్ షాకు చిత్తశుద్ధి ఉంటే, వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ల పరిమితిని 50% తొలగించడానికి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టాలి. సుధీర్ కమిషన్ రిపోర్ట్ చదవండి. మీకు సాధ్యం కాకపోతే, దయచేసి ఎవరినైనా అడగండి. ముస్లింలకు రిజర్వేషన్లు సుప్రీంకోర్టు స్టేతో కొనసాగుతున్నాయి’ అని ఒవైసీ పేర్కొన్నారు.

 

 

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh