AP Polycet 2023 Results: నేడు విడుదలైన ఫలితాలు

AP Polycet 2023 Results

AP Polycet 2023 Results: నేడు విడుదలైన ఏపీ  పాలిసెట్‌ ఫలితాలు

AP Polycet 2023 Results: ఏపీలో  పాలిసెట్‌ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐఏఎస్ సి .నాగరాణి ఫలితాలను విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా మే10న ఏపీ పాలిసెట్‌ (AP POLYCET) – 2023 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.

పాలిసెట్‌-2023 పరీక్షకు ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,43,625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు (మే 20) విడుదలయ్యాయి.

మొత్తం పాస్‌ పర్సెంటేజ్‌ 86.5 శాతంగా ఉంది. ఇక వీరిలో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 88.90 శాతం కాగా, అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 84.74 శాతంగా నమోదైంది.

ఇదిలా ఉంటే 15 మంది విద్యార్థులు 120 కి 120 మార్కులు సాధించారు. వీరంతా ఉభయగోదావరి జిల్లా విద్యార్థులే కావడం విశేషం.

Also Watch

Trains: ఆంధ్ర ప్రదేశ్ లో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

ఈ ఏడాది పాలిసెట్‌ కోసం 1,60,329 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,24,021 మంది అర్హత సాధించారు.

ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మొత్తం 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు పూర్తి వివరాలకు, ఫలితాలను (AP POLYCET Results 2023) చెక్‌ చేసుకోవడానికి https://polycetap.nic.in/వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా – గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
డిప్లొమా కోర్సులు : సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అలాగే మే 17వ తేదీనతెలంగాణ  పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష ముగిసింది. అయితే ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది సాంకేతిక విద్యా మండలి.

ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ఇస్తామని వెల్లడించింది.

మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 296 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 92.94శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

One thought on “AP Polycet 2023 Results: నేడు విడుదలైన ఫలితాలు

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh