రింకూ సింగ్‌పై కీలక ట్వీట్ చేసిన రోహిత్

ఐపిల్ 2023:రింకూ సింగ్‌పై కీలక ట్వీట్ చేసిన రోహిత్

ఐపీఎల్ 16వ సీజన్ కూడా ఎన్నో ఉత్కంఠ భరిత మ్యాచులను ప్రేక్షకులకు చూపించింది. గతేడాది రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో చేరడంతో మరింత మంది కొత్త కుర్రాళ్లు తమ సత్తాను ప్రదర్శించే అవకాశం దక్కింది. అలాగే అంతర్జాతీయ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకొని, వెల కట్టలేని అనుభవాలను ఈ కుర్రాళ్లు పోగు చేసుకుంటున్నారు.

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అధ్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ సిక్స్ లతో హోరెత్తించి జట్టును విజయతీరాలు చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో కేకేఆర్‌ విజయానికి 29 పరుగులు కావల్సిన నేపథ్యంలో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ తమ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి బంతికి రింకూ సిక్స్‌ బాదగానే కేకేఆర్‌ డగౌట్‌ మొత్తం సంబరాల్లో మునిగి తెలిపోయింది. కేకేఆర్‌ ఆటగాళ్లు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తమ జట్టు హీరోను భుజాలపై ఎత్తుకుని మరి అభినందిచారు.

దీంతో అందరూ కూడా రింకూ సింగ్ సత్తాను మెచ్చుకుంటున్నారు. అతన్ని సానబెడితే భారత జట్టుకు అద్భుతమైన ఫినిషర్ దొరికినట్లే అని అందరూ అంటున్నారు. ఫ్యాన్స్ కూడా రింకూ సింగ్ సూపర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదే విషయాన్ని టీమిండియా సారధి రోహిత్ శర్మ కూడా చెప్పాడు. ఐపీఎల్‌లో సత్తా ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశాలు లభిస్తాయనే మాటకు రింకూ సింగ్ ఒక ఉదాహరణ అని ట్వీట్ చేశాడు.

‘నిజంగా సత్తాకు అవకాశం లభించే వేదిక ఐపీఎల్. రింకూ.. ఎవరూ నమ్మలేని ఇన్నింగ్స్ ఇది. ఇక యష్.. దీని నుంచి నేర్చుకోవాలి. ఇదొక చేదు అనుభవం అంతే’ అని రోహిత్ పేర్కొన్నాడు. గతేడాది ఫినిషర్‌గా కొత్త కుర్రాడు ఆయుష్ బదోనీ కూడా అందరి దృష్టినీ ఆకర్షించాడు. బౌలర్లలో కూడా చెన్నై పేసర్ ముఖేష్ చౌదరి, మొహ్‌సిన్ ఖాన్ వంటి పేసర్లు కూడా ఐపీఎల్ వల్లనే గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న రింకూ ఒక్క ఫోర్‌, 6 సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. కాగా కేకేఆర్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 14న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh