మూడు అరుదైన రికార్డ్‌లు బద్దలుకొట్టానున్న కోహ్లీ

Virat Kohli Records: మూడు అరుదైన రికార్డ్‌లు బద్దలుకొట్టానున్న కోహ్లీ

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్స్‌పై కన్నేశాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి భారత్ జట్టు వరుసగా మూడు వన్డేలను ఆడబోతోంది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఫామ్ కొనసాగిస్తే? ఓ మూడు అరుదైన రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకి ఫస్ట్ వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో భారీ శతకం  బాదిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ సంవత్సరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం 8, 11, 36 పరుగులే చేశాడు. కానీ ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటలకి ఫస్ట్ వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా ఇటీవల ముగిసిన నాలుగో టెస్టులో భారీ శతకం బాదిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన కోహ్లీ ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం 8, 11, 36 పరుగులే చేశాడు. కానీ ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లీకి మెరుగైన రికార్డ్ ఉంది.

ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 41 వన్డే ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు 2083. ఇందులో 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉండగా సగటు 54.82‌గా ఉండటం విశేషం. దాంతో ఈ వన్డే సిరీస్‌లోనూ కోహ్లీ సత్తాచాటుతాడని మాజీ క్రికెటర్లు జోస్యం చెప్తున్నారు. ఈ సిరీస్‌లో కోహ్లీ 191 పరుగులు చేస్తే? వన్డేల్లో 13 వేల పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా రికార్డ్‌ల్లో కోహ్లీ నిలవనున్నాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14234), రిక్కీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13430) మాత్రమే ఈ రికార్డ్‌ని అందుకున్నారు.

మూడు వన్డేల్లోనూ కోహ్లీ సెంచరీ నమోదు చేస్తే? సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డ్‌ని కోహ్లీ సమం చేయనున్నాడు. అలానే మరో 48 పరుగులు చేస్తే? సొంతగడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలవనున్నాడు. సొంతగడ్డపై సచిన్ టెండూల్కర్ 6976 పరుగులు చేయగా ఆస్ట్రేలియాలో రిక్కీ పాంటింగ్ 5406 పరుగులు చేశాడు. ప్రస్తుతం 5358 పరుగులతో ఉన్న కోహ్లీ ఈ రికార్డ్‌ని మొదట బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh