భారీగా పతనం అయిన పసిడి

Gold price today: భారీగా పతనం అయిన

3పసిడి

బంగారం కొనాలని ఆలోచనలో ఉన్నారా? అయితే అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త. కేవలం ఒకే ఒక్కరోజులో బంగారం రేట్లు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పుత్తడి ధరలు భారీగా పడిపోవడంతో దాని ప్రభావం మన దేశీయ బంగారం ధరల మీద కూడా ప్రభావం చూపింది. అందువల్ల బంగారం ధర దిగి వచ్చింది.గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలోనే తాజాగా గురువారం మాత్రం గోల్డ్‌ ధరలో తగ్గుదుల కనింపించింది. బంగారం ధరతో పాటే వెండి కూడా పతనమైంది. భారత రాజధాని నగరం అయిన ఢిల్లీలో తులం అంటే 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒకేసారి రూ.800 లు తగ్గడంతో ఇప్పుడు దీని ధర రూ.54,350 పడిపోయింది. ఇంతకు ముందు ట్రేడింగ్‌లో ఈ ధర రూ.59,130 గా ఉంది.

  • దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 54,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.
  •  చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,670 వద్ద నమోదైంది.
  •  ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 59,670 వద్ద ఉంది.
  •  బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,180 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

  •  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,130 ఉంది.

వెండి ధర ఎలా ఉందంటే..

బంగారం ధరతో పాటు వెండి ధరలోనూ తగ్గుదల కనిపించింది. గురువారం దేశంలో కిలో వెండిపై రూ. 500 వరకు పెరిగింది. ఈరోజు చెన్నైలో కిలో వెండి ధర రూ.74,0600, ముంబైలో రూ. 71,600, ఢిల్లీలో రూ. 71,600, కోల్‌కతాలో కిలో వెండి రూ. 71,600 బెంగళూరులో రూ.74,000, హైదరాబాద్‌లో రూ.74,000, విశాఖ, విజయవాడలో రూ.74,000 వద్ద ఉంది.

Leave a Reply