PBKS Vs RCB: ఘన విజయం

PBKS Vs RCB

PBKS Vs RCB: ఘన విజయం

PBKS Vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో తన జట్టుకు విజయాన్నందించాడు. నేడు PBKS Vs RCBలో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లోపంజాబ్ కింగ్స్ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి బెంగళూరు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. స్టాండిన్ కెప్టెన్ కోహ్లీ 59, డుప్లెసిస్ 84 పరుగులు చేశారు. అనంతరం బెంగళూరు నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 150 పరుగులకు ఆలౌట్ అయింది.

ఏడాదిన్నర తర్వాత కెప్టెన్సీ చేసిన విరాట్ కోహ్లీ, విజయంతో రీఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్‌కి శుభారంభం దక్కలేదు. మొదటి బంతికి ఫోర్ బాదిన అథర్వ టైడ్, రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఓ సిక్సర్ బాది 8 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, వానిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

PBKS Vs RCB  మ్యాచ్ లో 2 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ కూడా సిరాజ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ఆర్‌సీబీకి వికెట్ దక్కింది. 9 బంతుల్లో

కెప్టెన్ సామ్ కుర్రాన్ కూడా 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఓ ఎండ్‌లో వికెట్ పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును కదిలించిన ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్.. 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి పార్నెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.

97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్ ఓ సిక్సర్ బాదిన షారుక్ ఖాన్, హసరంగ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్, జితేశ్ శర్మ కలిసి 8వ వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

IPL :PBKS Vs RCB

13 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన హర్‌ప్రీత్ బ్రార్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మహ్మద్ సిరాజ్, అదే ఓవర్‌లో నాథన్ ఎల్లీస్‌ని కూడా బౌల్డ్ చేశాడు.దీంతో 18 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్

4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, ఐపీఎల్ బెస్ట్ గణాంకాలు నమోదు చేశాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులు చేసిన జితేశ్ శర్మ, ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

PBKS Vs RCB అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగుల స్కోరు చేయగలిగింది. ఒకనాక 137/0 స్కోరుతో కనిపించిన ఆర్‌సీబీ, ఈజీగా 200+ స్కోరు చేస్తుందని అనుకున్నారు ఫ్యాన్స్.  డెత్ ఓవర్లలో వరుస వికెట్లు తీసిన పంజాబ్ కింగ్స్ బౌలర్లు, ఆర్‌సీబీ స్కోరును కట్టడి చేశారు.

ఆర్సీబీ బ్యాటర్లలో ఫాఫ్ డుప్లెసిస్ 56 బంతుల్లో 84 పరుగులు ; 5 ఫోర్లు, 5 సిక్సర్లు, విరాట్ కోహ్లీ47 బంతుల్లో 59 పరుగులు ; 5 ఫోర్లు, 1 సిక్సర్  హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh