రజనీకాంత్ మాత్రమే అందుకు అర్హులు.. ఇంకెవ్వరికి లేదు..!

నయనతార.. సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన అమ్మడు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది. ఇదిలా ఉంటే.. మార్చి 5, 2025న నయనతార తన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసింది. అందులో ఆమె “ఇక నుండి ఎవరూ నన్ను లేడీ సూపర్ స్టార్ అని పిలవకూడదు, ఇక నుంచి నన్ను నయనతార అని పిలవండి” అని చెప్పింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఆ ప్రకటనలో ఆమె ఇలా చెప్పింది, “నా అభిమానుల నా పై ఉన్న ప్రేమతో నన్ను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు.” కానీ నాకు, నయనతార అనే పేరు దానికంటే ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి, దయ చేసి నన్ను అలా పిలవకండి అని తెలిపింది. అందుకే తనను ఎవరూ లేడీ సూపర్ స్టార్ అని పిలవకూడదు, కేవలం నయనతార అని మాత్రమే పిలవాలని తెలిపింది. ఇప్పటికే స్టార్ నటులు అజిత్, కమల్ హాసన్ కూడా తమను బిరుదులతో పిలవద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నయనతార కూడా అభిమానులను రిక్వెస్ట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

నయన్ ప్రస్తుతం మూకుతి అమ్మన్ 2లో నటిస్తుంది. దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ మరియు పూజలు నిన్న చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్‌లో విజయవంతంగా జరిగాయి. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విలేకరులతో సమావేశమైన నటి ఖుష్బును నయనతార ప్రకటన గురించి ప్రశ్నలు అడిగారు. నటి ఖుష్బు నయనతార తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని, వారికి బిరుదు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన కాలంలో, ఎవరికీ ఆ బిరుదు ఇవ్వలేదు. సూపర్ స్టార్ బిరుదు రజనీకాంత్ కు మాత్రమే ఇచ్చారు. ఆయన మాత్రమే ఆ బిరుదుకు అర్హులు. లేకపోతే, ఎవరికీ డిగ్రీ ఇవ్వడం మంచిది కాదు. వారిని పేర్లతో పిలిస్తే బాగుంటుందని నటి ఖుష్బు తెలిపారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh