గత కొంత కాలంగా సినీనటుడు నరేష్ వివాదాస్పద సంబంధాలతో వార్తల్లో నిలిచారు. నటి పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేస్తున్న ఈ నటుడు ఇటీవల ట్విట్టర్ ద్వారా ‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని ఓ ప్రకటన చేశారు. ఆ ప్రకటన తో పాటు వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటున్న వీడియోను తన ట్విటర్ ఖాతాల్లో అప్ లోడ్ చేశాడు. కాగా నరేష్, పవిత్ర కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని పలు మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం కావడంతో దాంతో అందరికీ తెలిసేలా నరేష్, పవిత్ర కేక్ కట్ చేస్తున్న వీడియోను కూడా నరేష్ అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ తెరపై చూపించారు. ‘న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, మీ అందరి ఆశీస్సులు కావాలి’ మా నుంచి మీ అందరికీ కూడా హ్యాపీ ఇయర్ అని క్యాప్షన్ జోడించారు. కానీ ఆ ప్రకటన కామెంట్స్ సెక్షన్ లో నరేష్, పవిత్ర అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కొందరైతే తమ మ్యారేజ్ అనౌన్స్ మెంట్ వీడియోను ‘వెరీ రొమాంటిక్’ అని కూడా పిలిచారు.
కానీ కొంతమంది నెటిజన్లు బ్యాడ్ కామెంట్స్ చేయడంతో నరేశ్ తన వ్యక్తిగత జీవితం గురించి అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించి, పంపిణీ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై మండి పడ్డారు. ఆ విషయం పై నటుడు నరేష్ పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయించారు. కొన్ని రోజుల క్రితం నరేష్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తన వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకరమైన వెబ్‌లింక్‌లను సృష్టించి ప్రసారం చేస్తున్నారని పోలీసులకు తెలుపగ ఐపీసీ సెక్షన్ 509పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి ఆన్ లైన్ వేధింపులను ఎదుర్కొంటున్నారని విలేకరులతో అన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేశామని, అభ్యంతరకర కంటెంట్ ఉన్న కొన్ని వెబ్ లింకులను ఇప్పటికే తొలగించామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు అలాంటి మరిన్ని లింకుల గురించి తెలియజేస్తూ నరేష్ మమ్మల్ని సంప్రదించడంతో తగిన చట్టపరమైన చర్యలు తికుకొనున్నట్లు అని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: