న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా లేటెస్ట్ గా కింగ్ ఆఫ్ కోత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పాన్ ఇండియా అనడం బాగాలేదు కానీ దుల్కర్ అసలైన పాన్ ఇండియా యాక్టర్ అని అన్నారు. అలా ఎందుకు అంటే ఓ బాలీవుడ్ డైరెక్టర్ దుల్కర్ తో సినిమా చేస్తాడు.. తెలుగు డైరెక్టర్ కూడా దుల్కర్ కోసం కథ రాస్తాడు. మలయాళంలో కూడా చేస్తారు. ఇలా అన్ని భాషల వాళ్లు దుల్కర్ కోసం కథ రాస్తున్నారు అంటే దుల్కర్ నిజమైన పాన్ ఇండియా యాక్టర్ అని అన్నారు నాని.
అయితే నాని దుల్కర్ పై అభిమానంతో అలా అని ఉండొచ్చు తప్పేం లేదు కానీ దుల్కర్ ని అనడంతో పాటుగా ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్స్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల మీద వారికి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ మీద సెటైర్ వేస్నట్టుగా అనిపిస్తుంది. నాని ఉద్దేశం అది కానప్పటికీ కూడా నాని ని మన పాన్ ఇండియా స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా కూడా టార్గెట్ చేస్తున్నారు.
ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానిలోని తప్పులని వెతికి టార్గెట్ చేయడం సోషల్ మీడియాలో కామన్ అయ్యింది. కింగ్ ఆఫ్ కోత సినిమా ఈవెంట్ లో నాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతుంది. దుల్కర్ నిజంగానే పాన్ ఇండియా స్టార్ అయినా అతనొక్కడే అని చెప్పడం మాత్రం ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది.