Nadhi : కూలిన ఆర్మీ హెలికాప్టర్.. సిరిసిల్ల జవాన్ మృతి
Nadhi జమ్ముకశ్మీర్ లోని కిశ్త్ వాఝ్ సమీపంలో ఓ ఆర్మీ హెలికాప్టర్ గురువారం రోజు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మరణించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన పబ్బాల అనిల్ అనే ఆర్మీ జవాన్ జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. అనిల్ గత 11 ఏళ్లుగా ఆర్మీలో పని చేస్తుండగా గురువారం జమ్ము కశ్మీర్ వద్ద సిగ్నల్ సమస్యల వలన అనిల్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తున్న “ఆర్మీ ఏఎల్ హెచ్ ధ్రువ్” హెలికాప్టర్ నదిలో పడిపోయింది.
అయితే విషయం తెలుసుకున్న అధికారులు.. మార్వా ప్రాంతంలోని నదిలో హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఆ ప్రమాదంలో అనిల్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆర్మీ జవాన్ అనిల్ మలాపూర్ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్యకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు అనిల్ 2011లో సైన్యంలో చేరి టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నారు. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్, అరవ్ ఉన్నారు. అనిల్ మృతితో మల్లాపూర్ లో విషాధ ఛాయలు అలముకున్నాయి.
కాగా గత నెలలో పెద్ద కొడుకు పుట్టినరోజు వేడుకలతోపాటు అత్తగారి ఊరు కోరెంలో జరిగిన బీరప్ప పట్నం పండుగ ఉన్నందున.. అనిల్ 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చి వెళ్లాడని గ్రామస్థులు పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అనిల్‌కు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి Nadhi వినోద్‌కుమార్ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
అనిల్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అలాగే ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. నిన్న జమ్ము కశ్మీర్ హెలికాప్టర్ ప్రమాదంలో Nadhi ప్రాణాలు కోల్పోయిన క్రాఫ్ట్స్‌మ్యాన్ పబ్బల్ల అనిల్‌కు నివాళులు అర్పించారు.
#WATCH | J&K: Northern Army Commander Lt Gen Upendra Dwivedi pays tribute to Craftsman (Avn Tech) Pabballa Anil, who lost his life in a helicopter crash in Kishtwar yesterday. pic.twitter.com/OjJhaJ379R
— ANI (@ANI) May 5, 2023