Mukhesh Ambani : వారసురాలు రాకతో ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు

Mukhesh Ambani

Mukhesh Ambani : వారసురాలు రాకతో ముఖేష్ అంబానీ ఇంట సంబరాలు

Mukhesh Ambani : ఐశ్వర్యానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచారు. వేల కోట్ల సంపదతో మన దేశంలోనే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మన దేశంలో.. రిలయన్స్‌ అడుగుపెట్టని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. బట్టలు మొదలు.. పెట్రోల్‌ బంకుల వరకు.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు ముఖేశ్‌ అంబానీ. దేశంలోనే టాప్‌ మోస్ట్‌ బిజినెస్‌మ్యాన్‌గా రాణిస్తున్నాడు. కుమారులిద్దరూ, కుమార్తె.. కూడా రిలయన్స్‌ వ్యాపార సామ్రాజ్యంలో భాగస్వాములయ్యి తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అసలు విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబంలోకి మరో చిన్నారి అడుగుపెట్టింది. ఆయన పెద్ద కుమారుడు అకాశ్‌ అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఆకాశ్ భార్య శ్లోకా బుధవారం ఇక్కడి ఓ ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మినిచ్చారు. అంబానీ ఇంటికి వారసురాలు రావడంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఆకాశ్, శ్లోకాలకు 2019లో వివాహం జరగ్గా.. 2020లో తొలి సంతానంగా బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఆ బాబుకు పృథ్వీ ఆకాశ్ అంబానీ అని పేరు పెట్టగా ప్రస్తుతం అతడికి రెండేళ్లు.

అకాశ్ దంపతులకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అంబానీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ పరిమల్ నథ్వానీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఆకాశ్, శ్లోకా అంబానీల లిటిల్ ప్రిన్సెస్ సంతోషకరమైన రాకకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఈ అమూల్యమైన క్షణాలు మీ జీవితాలకు అపారమైన ఆనందాన్ని ప్రేమను తెస్తుంది’ అని ట్వీట్ చేశారు.

అయితే ఏప్రిల్‌లో ముంబైలోని ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్‌లో శ్లోకా కాస్త బొద్దుగా కనిపించింది.ఆమెకు రెండో బిడ్డ పుట్టబోతున్నట్లు అప్పుడే అందరు అనుకున్నారు.. వారం రోజుల క్రితం కుటుంబ సమేతంగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఆకాష్ అంబానీ కొనసాగుతున్నారు. అంబానీ కుటుంబం నడుపుతున్న స్కూల్‌లో చదువుతున్న ఆకాష్, శ్లోక ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో పెళ్లికి అంగీకరించారు. శ్లోకా తండ్రి రస్సెల్ మెహతా, ప్రముఖ వజ్రాల వ్యాపారి.

అయితే  గతేడాది ముకేశ్ అంబానీ కుమార్తె కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  కానీ ఆమె ప్రసవం అమెరికాలో జరిగింది. అక్కడ నుంచి భారత్‌కు తన కవలలతో వచ్చిన కుమార్తెకు Mukhesh Ambani : కుటుంబం ఘనస్వాగతం పలికింది. ఈ సమయంలో దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాల నుంచి వేద పండితులను రప్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే, 300 కిలోల బంగారాన్ని దానం చేసినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు, అభాగ్యుల కోసం ఐదు అనాథ శరణాలయాలను కూడా అంబానీ ప్రారంభించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh