MP : సురేశ్ ధనోర్కర్ ఇకలేరు
MP : మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బాలు ధనోర్కర్ కన్నుమూశారు.
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 47 ఏండ్లో ధనోర్కర్ ఢిల్లీలోని మేదాంత హాస్పటల్ లో
చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.ప్రస్తుతం ఆయన చంద్రాపూర్ పార్లమెంటు నియోజకవర్గానికి
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన భార్య ప్రతిభా ధనోర్కర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
గత కొంత కాలంగా కిడ్ని సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన నాగ్‌పూర్‌లోని ఓ హాస్పటల్ లో గతవారం చేరారు.
అయితే అనంతరం అతడిని ఢిల్లీకి తరలించారని కాంగ్రెస్ పార్టీ నేత బాలాసాహెబ్ థోరట్ చెప్పారు.
అయన అంతకుముందు శివసేనలో పనిచేశారు. 2014లో వరోరా-భద్రావతి అసెంబ్లీ సీటును గెలుచుకున్నారు.
2019వ సంవత్సరంలో శివసేన పార్టీని వీడి లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు.
చంద్రాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం MP : నుంచి పోటీ చేసి కేంద్ర మాజీమంత్రి,
బీజేపీ నేత హన్సరాజ్ అహిర్‌పై విజయం సాధించారు. అయితే 27 న ఆయన నాగ్ పూర్
లోని హాస్పిటల్ లో కిడ్నీలో రాళ్ల వ్యాధికి చికిత్స పొందారని, అదే రోజున ఆయన తండ్రి
నారాయణ్ ధనోర్కర్ అనారోగ్యంతో మరణించారని లొంధే వెల్లడించారు.
అయితే కడుపునొప్పితో బాధ పడుతున్న సురేష్ బాలును ఈ నెల 28 న నాగ్ పూర్
నుంచి ఢిల్లీకి విమానంలో తరలించినట్టు అతుల్ లొంధే తెలిపారు. ఆదివారం జరిగిన
తన తండ్రి అంత్యక్రియలకు కూడా సురేష్ బాలు హాజరు కాలేకపోయారని, అంతలోనే ఈ విషాదం జరిగిందన్నారు.
బాలు ధనోర్కర్‌పార్థివదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామం వరోరాకు తరలించనున్నారు.
బుధవారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.
ధనోర్కర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ప్రజాసేవ, పేదల సాధికారతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్,
ఎం ఆరిఫ్ నసీమ్ ఖాన్, యశోమతి ఠాకూర్, డాక్టర్ శశి థరూర్ సహా కాంగ్రెస్ అగ్రనేతలు ధనోర్కర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహా వికాస్ అఘాడీ నేతలు శరద్ పవార్, జయంత్ పాటిల్, అజిత్ పవార్, సుప్రియా సూలే, ఛగన్ భుజ్బల్,
శివసేన (యూబీటీ) నేత కిశోర్ తివారీ తదితరులు ధనోర్కర్ మృతికి సంతాపం తెలిపారు.
అధికార శివసేన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, భారతీయ MP : జనతా
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే తదితరులు ధనోర్కర్ మృతికి సంతాపం తెలిపారు.