సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కేటీఆర్

minister-ktr-response-on-medico-preethi-death

సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: కేటీఆర్

కేఎంసీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి సీనియర్ వేధింపులు తాళ్లలేక  ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. అయితే పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ప్రీతి సుమారు ఐదు రోజులుగా పాటు మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు తుది శ్వాస విడిచింది.  ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో గొడవలు, ర్యాగింగ్ కారణంగా మనస్థాపానికి గురై ప్రీతి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న కేటీఆర్ అందుకు కారణమైన వాళ్లు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రీతి విషయం తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్పందించారని  విద్యార్థిని బతికించుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేశామని కేటీఆర్ వివరించారు. కానీ దురదృష్టవశాత్తు ప్రీతి మరణించిందన్నారు. అయితే కొందరు మాత్రం ప్రీతి ఘటనపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర మల్లర మాటలతో మతం, కులం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. తప్పు చేసింది సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయాన్ని నిమ్స్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రీతి మృతిపై తలిదండ్రులు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నేతలు కూడా ప్రీతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన లవ్ జిహాదీలో భాగమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. బండి సంజయ్ చేసిన వాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ గారు.

ఇది కూడా చదవండి :

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh