మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు టైటిల్ గా ఆపరేషన్ వాలెంటైన్ అని ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమాను 2023 డిసెంబర్ 8న రిలీజ్ డేట్ లాక్ చేశారు.
వరుణ్ తేజ్ 13వ సినిమాగా వస్తున్న ఈ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా అటెంప్ట్ గా ఈ సినిమా వస్తుంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా టైటిల్ తోనే ఈ సినిమాపై క్రేజ్ తెచ్చారు మేకర్స్.
ఆల్రెడీ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాంఢీవధారి అర్జున సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ ఆ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఆడియన్స్ ని అలరించడానికి వస్తుంది. సినిమా విషయంలో ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుందని తెలుస్తుంది. మరి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా వరుణ్ తేజ్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.