ఒకే వేదిక పై ఒకటి కాబోతున్న 225 జంటలు
మనం సామూహిక వివాహాలను ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి , శ్రీశైలం, అన్నవరం, యాదాద్రి భువనగిరి లాంటి ఆలయాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహాలను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సామూహిక వివాహాలు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ గ్రౌండ్ లో సామూహిక వివాహాలు నిర్వహించేందుకు ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సకల ఏర్పాట్లను చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే స్థాపించిన మర్రి జనార్దన్ రెడ్డిగారు ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా కూడా పేద ప్రజల వివాహ మహోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఐదవసారి అత్యంత ఘనంగా వివాహ నిర్వహించేందుకు ట్రస్ట్ మెంబర్లు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ఇందుకోసం నాగర్ కర్నూల్ కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 225 జంటలు ఒకటి కాబోతున్నట్టుగా ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునా రెడ్డి ప్రకటించారు. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున పెళ్లి మండప స్టేజిని ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. 900 ఫీట్లతో భారీ కళ్యాణ వేదికపై దాదాపుగా 1000 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లను చేపట్టారు.
ఒక్కొక్క జంటకు కల్యాణం చేసేందుకు 8 ఫీట్ల పొడవు 6 ఫీట్ల వెడల్పు ప్రదేశం వచ్చే విధంగా వివాహ వేదికను ఏర్పాటు చేసినట్టుగా వివరించారు. ఫిబ్రవరి 12న అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుకలను నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలు అత్యంత వైభవంగా ఎలాంటి ఆటంకాలు కలవకుండా విజయవంతంగా పూర్తి కావాలని జెడ్పి హైస్కూల్ లోని భూమికి పూజ చేసి ఏర్పాట్లను చేపట్టారు. వివాహం చేసుకున్న జంటలకు కొత్త సంసారం పెట్టేందుకు కావలసినటువంటి గృహ వినియో గ వస్తువులు అన్నింటిని కూడా ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు అందిస్తారు. దీంతో పాటుగా పెళ్లికి వచ్చేటువంటి బంధుమిత్రులందరికీ బోజన సదుపాయాలు కల్పించడానికి భారీ ఏర్పాట్లను చేపట్టారు. మాంసాహారం, శాఖాహార వంటకాలను అన్నింటిని వండించి పెళ్లికొచ్చేటువంటి అతిధులకు సకల సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ వేడుకలకు రాష్ట్ర నాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ మేరకు భారీగా ఏర్పాట్లను చేస్తున్నామని వివరించారు.అయితే
ఇప్పటికే పెళ్లి కుమారుడు పెళ్లికూతురు కుటుంబ సభ్యులకు కావలసినటువంటి పట్టు బట్టలను కూడా సమర్పించారు. ఈ వివాహ మహోత్సవాలకు నియోజకవర్గం మొత్తం కూడా ఆహ్వాన పత్రికలను ఇంటింటికి తిరిగి ఎంజీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు అందజేశారు.
ఇది కూడా చదవండి: