Krithi Shetty : ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బేబమ్మా అలియాస్ కృతి శెట్టి ఆ సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఫస్ట్ సినిమా హిట్ పడితే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. అందుకే ఉప్పెన హిట్ తర్వాత అరడజను పైగా అవకాశాలు అందుకుంది కృతి. మొదట్లో హిట్ పడినా ఆ తర్వాత మాత్రం అమ్మడికి బ్యాడ్ లక్ వెంటాడింది. వరుసగా నాలుగు ఫ్లాపులతో తన ఫాం పూర్తిగా కోల్పోయింది కృతి శెట్టి.
వరుస ఫ్లాపుల వల్ల అమ్మడికి అవకాశాలు కూడా తగ్గాయి. ఈ క్రమంలో కృతి శెట్టి (Krithi Shetty ) తన ఆలోచనని మార్చేసుకుంది. మొదట్లో గ్లామర్ విషయంలో చాలా కండీషన్స్ పెట్టే అమ్మడు రాను రాను స్కిన్ షోకి సై అనే సిగ్నల్స్ ఇస్తుంది. రీసెంట్ గా అయితే కృతి చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయిపోతుంది. గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్న బేబమ్మ ఇక మీదట తనని ఈ యాంగిల్ లో కూడా చూసే అవకాశం ఉందని హింట్ ఇస్తుంది.
తన దాకా వచ్చిన ఏ ఛాన్స్ ని వదలకూడదని ఫిక్స్ అయిన కృతి (Krithi Shetty) సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి రెడీ అని చెప్పకనే చెబుతుంది. లేటెస్ట్ గా కృతి శెట్టి ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ట్రెండీ వేర్ తో అందాల తకదిమి ఆడేస్తున్న బేబబ్బ వయ్యారాలకు ఎలాంటి వాడైనా సరే పడిపోవాల్సిందే అనేలా ఉందని చెప్పొచ్చు. ఇక అమ్మడి ఓర కళ్ల చూపులు కుర్రాళ్ల గుండెల్ని గాయం చేస్తున్నాయి. మొత్తానికి ఈమధ్య కాలం లో కృతి శెట్టి చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమె మైలేజ్ పెంచేలా చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.