KL Rahul జట్టులో నుంచి తీసిపారేయండి..కేఎల్ రాహుల్‌పై ఫ్యాన్స్ ఫైర్!
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్(5 బంతుల్లో 5) విఫలమయ్యాడు. క్రిస్ వోక్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. రాహుల్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతపై దెబ్బకొట్టిన వోక్స్ ఫలితం రాబట్టాడు.ఈ ఓవర్ నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా.. రాహుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరైన ఫుట్ వర్క్ లేకపోవడంతో పాటు బంతిని అంచనా వేయడంలో రాహుల్ విఫలమవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతిలో పడింది. దాంతో ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు సరైన శుభారంభం అందలేదు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.ఇక కేఎల్ రాహుల్ వైఫల్యంపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కీలక మ్యాచ్‌లో రాహుల్ విఫలమవుతాడని ముందే ఊహించామని కామెంట్ చేస్తున్నారు. అసలు రాహుల్‌ను అనవసరంగా జట్టులోకి తీసుకున్నారని, ఇతని ఆటకంటే బిల్డప్ ఎక్కువగా ఉంటుందని మండిపడుతున్నారు. ఐపీఎల్, చిన్న దేశాలపై తప్పా పెద్ద జట్లతో, కీలక మ్యాచ్‌ల్లో ఆడలేడని కామెంట్ చేస్తున్నారు. ఇతర బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకే అతను జట్టులో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాహుల్ క్రీజులో ఉన్నంత సమయంలో మ్యాగీ చేసుకోవచ్చని సెటైర్లు పేల్చుతున్నారు. మ్యాథమెటిక్స్‌లో కేఎల్ రాహుల్ ఓ ప్రాబ్లమని, బయోలజీలో డాల్ఫిన్ అని, సైన్స్‌లో ఆటమ్ అని, చరిత్రలో మైత్, మూజిక్లో బీటీఎస్, పాలిటిక్స్‌లో రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కేఎల్ రాహుల్‌కు తన బిడ్డనిస్తే కెరీర్ నాశనమయ్యేలా ఉందని అతని మామ బాధపడుతున్నాడని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.టీమిండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రాడని, ప్రతిభ ఉన్నా.. ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ ట్వీట్స్‌తో రాహుల్ పేరు ట్రెండింగ్ అవుతోంది. కొందరైతే రాహుల్ గాంధీని జట్టులో నుంచి తీసేయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. పక్కకు దొబ్బేయండి నిరంజన్ గారూ అంటూ కామెంట్ చేస్తున్నారు. రాహుల్ వల్ల జట్టుకు ఉపయోగం ఏం లేదని కామెంట్ చేస్తున్నారు.రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తూవచ్చారు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్పిన్నర్లు బరిలోకి దిగడంతో బౌండరీలు బాదడంలో విరాట్, రోహిత్ తడబడ్డారు.
ఆదుకున్న కోహ్లీ.. దంచికొట్టిన హార్దిక్.
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63)దుమ్మురేపాడు. దాంతో టీమిండియా 169 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. హార్దిక్ పాండ్యాకు తోడుగా విరాట్ కోహ్లీ(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా..
ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్ తలో వికెట్ తీసారు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన రెండో ఓవర్లోనే రాహుల్(5) క్యాచ్ ఔటయ్యాడు.ఈ ఓవర్ నాలుగో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా.. రాహుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సరైన ఫుట్ వర్క్ లేకపోవడంతో పాటు బంతిని అంచనా వేయడంలో విఫలమైన రాహుల్ మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు సరైన శుభారంభం అందలేదు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు.ఆరంభంలోనే వికెట్ కోల్పోవడంతో రోహిత్, కోహ్లీ ఆత్మరక్షణలో ఆడారు. కోహ్లీ ఓ సిక్సర్ బాదగా..
రోహిత్ రెండు బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 38 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లే అనంతరం జోస్ బట్లర్ స్పిన్నర్లను రంగంలోకి దించగా.. పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తడబడ్డారు. దాంతో ఒత్తిడికి లోనైన రోహిత్ క్రిస్ జోర్డాన్ వేసిన 9వ ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన సూర్య బెన్ స్టోక్స్ వేసిన 11వ ఓవర్లో వరుసుగా సిక్స్, ఫోర్ బాది జోరు కనబర్చాడు. కానీ ఆదిల్ రషీద్ మరుసటి ఓవర్లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు.క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవ్వడంతో జట్టు స్కోర్ నెమ్మదించింది. అయితే 13వ ఓవర్ నుంచి ఓవర్‌కు ఓ బౌండరీ బాదిన ఈ జోడి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు.
జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా రెండు సిక్స్‌లు బాదగా.. కోహ్లీ క్విక్ డబుల్‌తో 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కానీ చివరి బంతికి విరాట్ … ఆదిల్ రషీద్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో రిషభ్ పంత్ ఓ బౌండరీ బాదగా.. హార్దిక్ 4, 6,4, 4 కొట్టి 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఈ ఓవర్‌లొ 20 పరుగులు వచ్చాయి. జోర్డాన్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతుల్లో సింగిల్సే రాగా.. మూడో బంతికి పంత్ రనౌటయ్యాడు. నాలుగో బంతిని సిక్స్ బాదిన హార్దిక్ పాండ్యా.. ఆఖరి రెండు బంతులను బౌండరీలకు తరలించినా.. ఆఖరి బంతికి హిట్ వికెట్ అవ్వడంతో టీమిండియా 168 పరుగులకే పరిమితమైంది.
రోహిత్ శర్మ కూడా త్వరగానే పెవలియన్ దారి పట్టాడు. ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండలేకపోయాడు. 28 బంతుల్లో నాలుగే ఫోర్లు కొట్టిన ఈ హిట్ మ్యాన్ 27 పరుగులు చేశాడు. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 9వ ఓవర్ అయిదో బంతికి భారీ షాట్ ఆడబోయాడు గానీ టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్త లోయర్ బ్యాట్‌ను తాకిన బంతి లాంగాన్ దిశగా గాల్లోకి ఎగిరింది. అక్కడే పొంచివున్న సామ్ కుర్రన్ దీన్ని అద్భుతంగా అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగిరి.. నేలకు తాకుందనుకున్న చివరి సెకెండ్లో బంతిని చేజిక్కించుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 56 పరుగులు.నయా సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. 10 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 14 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆదిల్ రషీద్ విసిరిన స్లో లెగ్ బ్రేక్ బంతికి బలి అయ్యాడు సూర్య. ఎక్స్ట్రా కవర్స్ దిశగా బంతిని స్వీప్ ఆడబోయి.. గాల్లోకి లేపాడు. డీప్ కవర్ పాయింట్లో ఉన్న ఫిల్ సాల్ట్ దాన్ని దొరకబుచ్చుకున్నాడు. దీనితో 75 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా.
బుమ్రా భార్య అందంగా లేదంటూ ట్రోల్.. ఆమె ముఖం పగిలేలా ఇచ్చిందిగా.,!
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య, స్టార్ క్రికెట్ యాంకర్ సంజనా గణేశన్ ఈ మ్యాచ్‌కు ముందు అడిలైడ్‌లో వాతావరణం బాగుందని తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. దీన్ని చాలా మంది క్రికెట్ అభిమానులు లైక్ చేశారు. కానీ ట్రోలర్లకు వేరే పని ఉండదు కదా.. ఈ ఫొటోపై కూడా విపరీతంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.ఎర్రడ్రెస్ వేసుకొని అడిలైడ్ స్టేడియంలో సంజన నిలబడి ఫొటో దిగింది. ఈ ఫొటోను ‘అడిలైడ్‌లో ప్రస్తుతం వాతావరణం బ్యూటిఫుల్‌గా ఉంది’ అని పోస్టు చేసింది. దీన్ని చూసిన చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలో ఎలాంటి పొరపాటు కానీ, తప్పుకానీ లేదు. అయినా ట్రోలర్లకు కారణం కావాలా? దీనిపై కూడా ట్రోలింగ్ చేశారు. ‘నువ్వు అంత అందగత్తెవు కాదు.
మరి బుమ్రాను ఎలా పడేశావ్?’ అని ఒక వ్యక్తి అడిగాడు.సాధారణంగా ట్రోలర్లు సంజనకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆమె వాళ్లకు చెంప ఛెళ్లుమనిపించేలా సమాధానాలు ఇస్తుంటుంది. తన అందంపై ట్రోల్ చేసిన వ్యక్తికి కూడా ఇదే జరిగింది. ‘నువ్వు చెప్పులాంటి మొఖంతో తిరుగుతున్నావ్ కదా. మరి దాని సంగతేంటి?’ అని రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకోలేక చస్తున్నారు. ఆమె సమాధానం గురించి తెలిసిన తర్వాతనే పోస్టు చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.చాలాకాలంగా స్పోర్ట్స్ యాంకర్‌గా ఉన్న సంజన..
ఐపీఎల్ వంటి టోర్నీలను కూడా హోస్ట్ చేస్తుంటుంది. అంతకుముందు 2014లో మిస్ ఇండియా పీజెంట్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత కొంతకాలం మోడల్‌గా పనిచేసి, అనంతరం రియాలిటీ షో యాంకర్‌గా కెరీర్ ఎంచుకుంది. ఇది జరిగిన కొంతకాలానికి టీమిండియా పేస్ గుర్రం బుమ్రా, ఆమె కలిశారు. వీళ్లిద్దరూ గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు.
సెమీఫైనల్లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం..
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ కు టీమిండియా 169 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కనీసం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అలవోకగా ఛేదించింది
ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ క్రీజులో పాతుకుపోయి టీమిండియా బౌలర్లకు చెమటలు పట్టించారు. వారి జోడీని విడగొట్టడం టీమిండియా బౌలర్లలో ఎవరి వల్లా కాలేదు. జోస్ బట్లర్ 49 బంతుల్లో 80 పరుగులు, అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 86 పరుగులు చేశారు. దీంతో 16 ఓవర్లలోనే ఇంగ్లండ్ 170 పరుగులు చేసింది. భారత బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియాలో బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ 5, రోహిత్ శర్మ 27, విరాట్ కోహ్లీ 50, సూర్యకుమార్ యాదవ్ 14, హార్దిక్ పాండ్యా 63, రిషబ్ పంత్ 6 (రనౌట్), రవిచంద్రన్ అశ్విన్ 0(నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు క్రిస్ జోర్డాన్ 2, అదిల్ రషీద్, క్రిస్ వోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఈ నెల 13న పాకిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసినప్పటికీ ఇంగ్లండ్ ఓపెనర్లకు కట్టడి చేయలేకపోయిన టీమిండియా బౌలర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.