KL RAHUL ప్రేయసిని పెళ్లాడనున్న KL రాహుల్
టీ20 ప్రపంచ కప్ పోరు ముగిసింది. క్రికెట్ పుట్టినిళ్ళైన ఇంగ్లాండ్ రెండోసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడింది. ఇక టోర్నీ ముగియడంతో అన్ని జట్లు ద్వైపాక్షిక సిరీసులపైన ద్రుష్టి పెట్టాయి. ఈ క్రమంలో భారత జట్టు నవంబర్ 18 నుంచి న్యూజిలాండ్ తో తలపడాల్సివుంది. ఈ టూర్ లో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న కె ఎల్ రాహుల్ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టిని మనువాడనున్నట్లు సమాచారం.లవ్ బర్డ్స్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఇప్పటికే పలు మార్లు కనిపించారు. తాజగా బయటకొస్తున్న విషయం ఏంటంటే.. వీరి ప్రేమకు పెద్దలు ఓకే చెప్పారట. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. వివాహం తర్వాత ఈ జంట కొత్త ఇంటికి మారనున్నారట. సమాచారం ప్రకారం.. ముంబైలోని పాలి హిల్‌లోని సంధు ప్యాలెస్‌లోని విలాసవంతమైన ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది.
ఇది పక్కనపెడితే.. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో రాహుల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్(50),జింబాబ్వే(51)తో జరిగిన మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేసినా.. కీలక మ్యాచుల్లో మాత్రం చేతులెత్తేశాడు. ఈ రెండు మ్యాచులు మినహాయిస్తే మిగిన నాలుగు మ్యాచుల్లో రాహుల్ చేసిన పరుగులు 27. పాకిస్తాన్ పై 4, నెదర్లాండ్స్ పై 9, సౌతాఫ్రికాపై 9, ఇంగ్లాండుపై 5.. ఇలా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. దీంతో రాహుల్ పై తీవ్ర విమర్శతోస్తున్నాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మనోడు మాత్రం ఇవేమీ పట్టనట్టు అతియా శెట్టితో పెళ్ళికి సిద్ధమవుతున్నాడు.
సూర్యకుమార్‌కు శాపంగా మారనున్న BCCI కొత్త రూల్!
టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యం ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానిని కలిచివేసింది. ఈ సారి వరల్డ్ కప్ పక్కా అనుకున్న వారి ఆశలపై నీళ్లు పోస్తూ.. సెమీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత భారత జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా జట్టు మొత్తం దారుణంగా విఫలమైందనే చెప్పాలి.
అలాగే టీ20 లాంటి ఫాస్ట్ ఫుడ్ ఫార్మాట్లో యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలనే డిమాండ్ కూడా తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం.. వరల్డ్ కప్ తర్వాత కొంతమంది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని.. జట్టులో యువ క్రికెటర్లకు అవకాశం కల్పించాలని సూచించారు
అలాగే బీసీసీఐ సైతం వరల్డ్ కప్ వైఫల్యంపై దిద్దుబాటు చర్యలతో పాటు.. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రక్షాళణ చేయనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్‌కు మరో రెండేళ్లు గడువు ఉండటంతో అప్పటి వరకు యువ క్రికెటర్లతో జట్టును సిద్దం చేయాలని బోర్డు పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. దీని కోసం ఒక కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇకపై టీ20 ఫార్మాట్‌కు 30 ఏళ్లకు పైబడిన వారిని పరిగణంలోకి తీసుకోకూడదనే నిబంధనలు తేవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, షమీతో పాటు సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడే అవకాశం ఉండదు. ఇప్పటికే సూర్య వయసు 32.. రాబోయే టీ20 వరల్డ్ కప్ కల్లా.. 34కు చేరుకుంటాడుఈ విషయంపై ఇండియన్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రయోగాలతో జట్టును నాశనం చేశారని..
మళ్లీ కొత్త కొత్త రూల్స్ తెచ్చి మరింత నాశనం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడు టీ20లకు ఈ 30 ఏళ్ల నిబంధన తెస్తే.. సూర్యకుమార్ లాంటి పవర్ హిట్టర్ కూడా టీ20లకు దూరం అవుతాడని అలాంటి ఆటగాడిని పక్కన పెట్టి టీమిండియా నిజంగానే వరల్డ్ కప్ గెలుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆటను ప్రతిపదికగా తీసుకోవాలి కానీ.. వయసును కాదని అంటున్నారు. ఫామ్‌తో పాటు ఫిట్‌గా ఉండే ఆటగాళ్లను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. కాగా.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ 239 పరుగులు చేసి.. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తొలి స్థానంలో విరాట్ కోహ్లీ 296 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. వీరిద్దరూ రాణించకుంటే.. టీమిండియా కనీసం సెమీస్ వరకు కూడా వచ్చేది కాదని ఫ్యాన్స్ అంటున్నారు.
IPL 2023: జడేజాను రిటైన్ చేసుకున్న చెన్నై..
ఐపీఎల్ మినీ వేలానికి ముందు తాము ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటున్నాయో? ఎవరిని వదిలేసుకుంటున్నాయో ఐపీఎల్ జట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే నాలుగు సార్లు ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ రిటెన్షన్ల జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను కూడా చెన్నై వదిలించేసుకోవడం గమనార్హం.చెన్నై జట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో తొలిపేరు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే.
గతేడాది ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు అందుకున్న జడ్డూ.. నాయకత్వంలో ఘోరంగా విఫలం అయ్యాడు. దీంతో 8 మ్యాచులు పూర్తయిన తర్వాత మళ్లీ ధోనీకే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది మేనేజ్మెంట్. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల కారణంతో టోర్నీకి జడ్డూ దూరమయ్యాడు.ఈ క్రమంలో చెన్నై యాజమాన్యానికి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతను చేసిన సోషల్ మీడియా పోస్టులను కూడా జడ్డూ డిలీట్ చేసేశాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక మినీ వేలానికి ముందు చెన్నై జట్టుకు జడ్డూ గుడ్‌బై చెప్పేస్తాడని, వేలం బరిలో నిలుస్తాడని వదంతులు వ్యాపించాయి.
వీటిపై చెన్నై మేనేజ్మెంట్ కానీ, జడేజా కానీ స్పందించలేదు.అయితే తాజాగా రిటెన్షన్ల జాబితాలో జడేజా పేరును మేనేజ్మెంట్ చేర్చింది. అతన్ని వదులుకునే ఆలోచన తమకు లేదనే సంకేతాలు పంపింది. ఈ క్రమంలో ధోనీకి తను తల వంచి అభివాదం చేస్తున్న ఫొటోను జడేజా షేర్ చేశాడు. దీంతోపాటు ‘అంతా బాగానే ఉంది.. రీస్టార్ట్’ అని పోస్టు పెట్టాడు. ఈ ట్వీట్ చూసిన చెన్నై ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ప్రస్తుతం మోకాలి చికిత్స చేయించుకొని రీహాబిలేషన్‌లో ఉన్న జడ్డూ.. వచ్చే ఏడాది ఐపీఎల్ నాటికి కోలుకుంటాడని సమాచారం.